ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆగస్టు 28న తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ మైదానంలోకి రాగానే చరిత్ర సృష్టించి విమర్శకుల నోళ్లు మూయించేందుకు ఆసియా కప్ మంచి అవకాశమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) 2022 ఆగస్టు 27 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం టీమ్ ఇండియాను ప్రకటించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆసియా కప్ కోసం భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత అతను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా ఆగస్ట్ 28న పాకిస్థాన్‌తో కింగ్ కోహ్లీ రంగంలోకి దిగనున్నాడు. పాకిస్థాన్‌తో మైదానంలోకి రాగానే కింగ్ కోహ్లి రికార్డు సృష్టించనున్నాడు. యూఏఈలోని దుబాయ్ కేంద్రంగా ఈ మ్యాచ్ జరగనుంది.
2018 ఎడిషన్‌లో ఆడకపోయినప్పటికీ ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో జాబితాలో విరాట్ కోహ్లీ ఒకడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 99 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇటువంటి పరిస్థితిలో అతను ఆగస్టు 28న పాకిస్థాన్‌తో తన 100వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్ నుంచి 100 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇంతకు ముందు రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 132 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లి పాకిస్తాన్‌పై మైదానంలోకి దిగిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన ఆసియాలో మొదటి ఆటగాడిగా నిలవనున్నాడు. ఇంతకు ముందు న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్ మాత్రమే ప్రపంచంలో ఈ ఘనత సాధించగలిగాడు.