end
=
Friday, September 20, 2024
క్రీడలుVirat Kohli:విరాట్ కోహ్లీ బెడ్‌రూమ్‌ వీడియో లీక్.. నెట్టింట వైరల్
- Advertisment -

Virat Kohli:విరాట్ కోహ్లీ బెడ్‌రూమ్‌ వీడియో లీక్.. నెట్టింట వైరల్

- Advertisment -
- Advertisment -

Virat Kohli : ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పర్సనల్ రూమ్(Personal Room) వీడియో లీక్‌పై అతడి భార్య, నటి అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్(World Cup) టోర్నమెంట్‌లో భాగంగా కోహ్లీ ఉన్న హోటల్ రూమ్‌కు సంబంధించి వీడియో నెట్టింట వైరల్(Viral) అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఇష్యూపై తాజాగా స్పందించిన నటి.. ‘కొంతమంది కనికరం, దయలేని అభిమానుల కారణంగా కొన్ని ఊహించని సంఘటనలు ఎదుర్కొంటాం. కానీ, ఇది చాలా చెత్త విషయం. ఒక మానవుని ప్రైవసీని(Privacy) ఉల్లంఘించడం అవమానం. మీరు కూడా ఈ సమస్యలో భాగమే అని తెలుసుకోవాలి. కొంత స్వీయ నియంత్రణను పాటించడం ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది. అలాగే ఇది మీ పడకగదిలో జరుగుతుంటే.. వెర్ ఈజ్ ది లైన్’ అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా ఈ వీడియో‌పై రియాక్ట్ అయిన ఆసీస్ ఆడగాడు డేవిడ్ వార్నర్.. ‘ఇది చాలా దారుణం. అస్సలు సమ్మతించేది కాదు’ అని కామెంట్ చేశాడు. బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ‘ఓ మై గాడ్.. ఇది దిగజారుడుతనానికి పరాకాష్ట’ అంటూ ఫైర్ అయింది.

(Cricket:కోహ్లీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్‌..)

ఇదిలావుంటే.. ‘వ్యక్తిగత స్వేచ్చను హరించేలా ఉన్న ఈ వీడియోను చూసి విరాట్ కోహ్లీ షాక్ అయ్యాను. నా గదిలో నాకే వ్యక్తిగత భద్రత లేకుంటే ఎలా? నా స్వేచ్చ(Freedom)కు భంగం కలిగించే అభిమానం నాకు అక్కర్లేదు. ఈ ఉన్మాదపు అభిమానం నాకొద్దు. వినోదం కోసం ఆటగాళ్లను ఓ వస్తువుగా పరిగణించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అభిమానులు తమ ఫేవరేట్ ఆటగాళ్లను చూసేందుకే, కలిసేందుకు ఉత్సాహం చూపుతారనే విషయం నాకు తెలుసు. వారి ఆసక్తి, ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాంటి అభిమానుల(Audience)ను ఎప్పుడూ నేను అభినందిస్తాను. కానీ, దయచేసి ఆటగాళ్ల ప్రైవసీని గౌరవించండి’ అంటూ లీక్ వీడియోను ఉద్దేశిస్తూ విరాట్ అభిమానులను కోరాడు. ఇక ఇందులో అందులో విరాట్ తన వస్తువులను ఎలా జాగ్రత్తగా పెట్టుకుంటాడో అనే విషయంతో పాటు అతను వాడే ప్రతీ వస్తువు చూపించారు. చివరకు అతని వాష్ రూమ్‌ను కూడా చిత్రీకరించారు. షూస్ కలెక్షన్స్‌(Collection)తో పాటు అతను వాడే ఫేస్ క్రీమ్స్, కిట్ బ్యాగ్ అన్నీ చూపించగా.. హోటల్‌కు సంబంధించిన సిబ్బందే అత్యుత్సాహంతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

https://www.instagram.com/reel/CkXVWI6g7Ff/?utm_source=ig_web_copy_link

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -