end
=
Friday, September 20, 2024
క్రీడలువిరాట్‌ నువ్వు సిక్సర్లు బాదాల్సిందే: యూవీ
- Advertisment -

విరాట్‌ నువ్వు సిక్సర్లు బాదాల్సిందే: యూవీ

- Advertisment -
- Advertisment -

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఉద్దేశించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఇవాళ కోహ్లి 32 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లికి శుభాకాంక్షలతో ముంచెత్తారు. కానీ, యూవీ మాత్రం కోహ్లికి ట్విట్టర్‌ ద్వారా డిఫరెంట్ కంగ్రాట్స్‌ చెప్పాడు. ‘నా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకో విరాట్‌ .. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటూ ఇంకా ఎక్కువ సిక్సర్లు కొట్టాలి. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే ప్లేఆఫ్‌లో మీ జట్టు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌ ‘ అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఈ సందర్భంగా కోహ్లితో కలిసి దిగిన ఫోటోను యూవీ షేర్‌ చేశాడు.

ఐపీఎల్‌ 13వ సీజన్‌ సందర్భంగా యూఏఈలో ఉన్న కోహ్లి ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే ప్లేఆఫ్‌ మ్యాచ్‌కు సన్నద్దమవుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే కోహ్లి సేన ముందుకెళుతుంది… లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12 సీజన్లు ముగిసినా ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఆర్‌సీబీ.. ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలనే కసితో ఉంది. ఈ క్రమంలోనే ఆరంభంలో రెండు మూడు మ్యాచ్‌లు తడబడినా ఆ తర్వాత తేరుకొని వరుస విజయాలు సాధించింది.

అయితే చివర్లో మళ్లీ హ్యాట్రిక్‌ ఓటములు పలకరించడంతో ఆర్‌సీబీ ఒక దశలో ప్లేఆఫ్‌ చేరుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అన్ని అడ్డంకులు అధిగమించి చివరికి ఎలాగోలా ప్లేఆఫ్‌ చేరిన బెంగళూరు జట్టు.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఏం చేయనుందనేది అభిమానుల్ని సందిగ్దంలో ఉంచింది. కెప్టెన్‌గా మంచి ఫామ్‌ కనబరుస్తున్న కోహ్లి ఇప్పటివరకు ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి 460 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఆఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 90 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ ఈ సీజన్‌లో కోహ్లి అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పొచ్చు. ఏబీడీతో సహా మిగితా బ్యాట్స్‌మెన్ సహకరిస్తే ఆర్సీబీకి విజయం పెద్ద విషయమే కాదు. నూతన ఆటగాడు దేవదూత్‌ పడిక్కల్ అద్భతంగా రాణిస్తున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -