-వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్ గత ఎనిమిది సీజన్ల నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు విరాట్ కోహ్లి. అయితే, ఇన్నేళ్లుగా జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నప్పటికీ.. కోహ్లి ఆర్సీబీకి ఒక్క టైటిల్ కూడా అందించలేదని భారత మాజీ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. జట్టు వరుస ఓటములకు నైతిక బాధ్యతవహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచించాడు. గంభీర్ మాటలకు భారత డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ భిన్నంగా స్పందించాడు. జట్టు ఓటమికి కోహ్లిని నిందించడం తగదన్నాడు. విరాట్ కెప్టెన్సీని అస్సలు తప్పుపట్టలేం. అతను జట్టును ముందుండి నడిపిస్తాడు. జట్టు తరఫున అత్యధిక పరుగులు చేస్తూ.. టీం సభ్యులకు మార్గదర్శిగా ఉంటాడు. టైటిల్ గెలవలేదని కెప్టెన్ ఒక్కడినే నిందిస్తే సరికాదని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఆర్సీబీ ఎన్నడూ పూర్తి స్థాయి జట్టుతో ఆడలేదనీ.. కోహ్లి, డివిలిలయర్స్‌లపైనే ఎక్కువగా ఆధారపడటం ఆ జట్టు బలహీనత అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల 32వ బర్త్‌డే జరుపుకున్న కోహ్లికి శుభాకాంక్షలు కూడా తెలిపాడు సెహ్వాగ్.