end
=
Sunday, January 19, 2025
వార్తలుఅంతర్జాతీయంVodafone:వొడాఫోన్ సీఈఓ రాజీనామా!
- Advertisment -

Vodafone:వొడాఫోన్ సీఈఓ రాజీనామా!

- Advertisment -
- Advertisment -
  • బాధ్యతల నుంచి తప్పుకున్న ‘నిక్ రీడ్’
  • 2023 మార్చి వరకు సలహాదారుగా ఒప్పందం


ఇటీవల పరిణామాల్లో దిగ్గజ కంపెనీలు మొదలుకొని, కొత్త స్టార్టప్‌ (Startup)లలోనూ ఉద్యోగుల తొలగింపులు, రాజీనామాలు (Resignations) కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెటా, ట్విటర్ (Meta, Twitter) వంటి కంపెనీల్లోని ఉన్నతస్థాయి ఉద్యోగులు సంస్థలను వీడారు. తాజాగా, వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్ (Vodafone CEO Nick Reid) తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త నాయకత్వంలో కంపెనీని నడిపించేందుకు ఇది సరైన సమయమని, దీనిపై కంపెనీ బోర్డు (Company Board)తో అంగీకరిస్తున్నానని నిక్ రీడ్ కూడా చెప్పారు.

2018 అక్టోబర్‌లో వొడాఫోన్ (Vodafone) కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న నిక్ రీడ్, ఆఫ్రికా, యూరప్‌ (Africa, Europe)లలో కంపెనీ విస్తరణకు ఎంతో కృష్టి చేశారు. ముఖ్యంగా టెలికాం టవర్ల (Telecom towers) వ్యాపార విభాగాన్ని ప్రత్యేక యూనిట్‌గా మార్చారు. క‌రోనా మహమ్మారి స‌మ‌యంలో కంపెనీని నిక్ రీడ్ స‌మ‌ర్థవంతంగా నిర్వహించారు. అయితే, నిక్ రీడ్ సీఈఓగా వైదొలగినప్పటికీ సంస్థతో అనుబంధం కొనసాగుతుందని, 2023, మార్చి వరకు ఆయన సలహాదారుగా ఉంటారని (To be an advisor) కంపెనీ పేర్కొంది. ఆయన స్థానంలో కంపెనీ సీఈఓ బాధ్యతలను తాత్కాలికంగా కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ మార్గరిటా డెల్లా (The company’s finance director is Margarita Della) వల్లి నిర్వహించనున్నారు.

(Delhi Municipal Elections:ఢిల్లీ మున్సిపల్ ‘ఆప్’దే)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -