end

వొడాఫోన్‌ ఐడియాలో భారీగా ఉద్యోగాల కోత

ముంబై:  టెలికం సెక్టార్‌లోకి రిలయన్స్‌ జియో రాకతో  ప్రధానంగా  భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా లాంటి సంస్థల ఆర్థిక పరిస్థితి  అతలాకుతలమైంది.  సవరించిన స్థూల ఆదాయం (ఏజిఆర్)పై సుప్రీం కోర్టు  ఇచ్చిన తీర్పుతో   టెలికం కంపెనీలకు భారీ దెబ్బ తగిలింది.  ఈ నేపథ్యంలోనే  టెలికాం కంపెనీలు తమ శ్రామిక శక్తిని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే  వొడాఫోన్‌, ఐడియా విలీనం తరువాత  భారీ సంఖ్యలో  ఉద్యోగాలు కోల్పోయారు. 

ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే నష్టాలను ఎదుర్కొంటున్న  వొడాఫోన్‌ ఐడియా ఆపరేటర్‌ దేశవ్యాప్తంగా దాదాపు 1500 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తున్నది.    గత మేనెలలో తన టెలికాం సర్కిళ్ల సంఖ్యను 22 నుంచి 10కి  కుదిస్తూ నిర్ణయం తీసుకున్నది. గత కొన్ని నెలల నుంచి వొడాఫోన్‌ ఐడియా సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 

మరోవైపు వొడాఫోన్‌ ఐడియా నుంచి 4జీ ఎక్విప్‌మెంట్‌ కోసం కొత్త ఆర్డర్లు తీసుకునేందుకు టెలికాం వెండర్లు నోకియా, ఎరిక్‌సన్‌, హువావే, జెడ్‌టీఈ కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థ చెల్లింపులు చేయదేమోననే అనుమానంతో కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి ముందుకురావడం లేదని టెలికాం నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version