end

Walnuts:రోజుకు మూడు స్ఫూన్లు చాలు..

  • వాల్‌నట్స్‌తో షుగర్‌ వ్యాధి పరార్‌
  • డయోబెటిక్‌ కంట్రోల్‌కు దివ్య ఔషధం

Diabetes:డ‌యాబెటిస్‌ అనగానే మాములుగా అందరికి గుర్తుకు వచ్చేది వయస్సు మళ్లిన వారికి ఈ వ్యాధి వస్తుందని బావిస్తుంటారు. కానీ ఇప్పుడు వయసుతో పని లేదు. ముఖ్యంగా ఈ నగరాల్లో నివసిస్తున్న వారికి ఈ వ్యాధి ఎక్కవగా సోకుందని కొన్ని సర్వేల్లో తేలింది. పోలుష్యన్‌(Pollution)తో నిండిపోయిన నగర జీవతం మనవ మనుగడను దెబ్బతీస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా షుగ‌ర్ వ్యాధి రావ‌డం వ‌ల్ల న‌చ్చిన ఆహారం తిన‌డానికి కూడా వీలు ప‌డ‌దు. ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న‌శైలి(Life Style), చెడు అల‌వాట్ల వ‌ల‌నే డ‌యాబెటిస్‌కు గుర‌వుతున్నారంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక‌సారి డయబెటిక్‌ వ్యాధి వ‌స్తే జీవితాంతం దానిని అనుభ‌వించాల్సిందే.

డ‌యాబెటిస్ టైప్‌-2 బారిన ప‌డిన‌వారు వాల్‌న‌ట్స్(Walnuts) తిన‌డం వ‌ల్ల బ‌య‌ట ప‌డొచ్చునని చెప్తున్నారు వైద్య నిపుణులు. రోజుకు మూడు స్పూన్ల వాల్‌న‌ట్స్ తీసుకోవ‌డంతో 47శాతం త‌గ్గుతుంద‌ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(University of California) పరిశోధకులు వెల్లడించారు. మ‌ధుమేహం ఒక‌టే కాదు క‌రోనా టైంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి(Immunity Power)ని పెంచుకోవ‌డానికి కూడా వాల్‌న‌ట్స్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయట. ఇంకేందుకు ఆల‌స్యం తిని ఆరోగ్యంగా ఉండండి. 

Exit mobile version