end
=
Friday, September 20, 2024
బిజినెస్‌బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా?
- Advertisment -

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా?

- Advertisment -
- Advertisment -

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతూనే వెళ్తున్నాయి. పసిడి రేటు ఈరోజు పైపైకి పెరుగుతూనే ఉంది. అలాగే వెండి ధర కూడా క్రమక్రమంగా పెరిగింది. అయితే మన దేశంలో మాత్రం బంగారం వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. పసిడి రేటులో నేడు కూడా ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లో నేటి పుత్తడి రేట్లు తెలుసుకుందాం. బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు వెంటనే ఆ పని పూర్తి చేయడంమంచిది. ఎందుకంటారా? పసిడి రేట్లు మళ్లీ పైపైకి కదులుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో ఆగస్ట్ 9న బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. పసిడి రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 51,870 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు విషయానికి వస్తే ఈ బంగారం రేటు కూడా స్థిరంగానే ఉంది. 10 గ్రాములకు రూ. 47,550 వద్ద కొనసాగుతోంది. వెండి రేటు విషయానికి వస్తే సిల్వర్ రేటు కూడా ఇదే దారిలో నడుస్తోంది. వెండి ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. సిల్వర్ రేటు కేజీకి రూ. 63 వేల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగానే కొనసాగింది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు జీఎస్‌టీ, ఇతర చార్జీలు అదనం. అందువల్ల రేట్లలో కొంత మార్పు ఉండొచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -