end

Weight loss:బరువు తగ్గాలనుకుంటున్నారా…?

ఎక్కిళ్లు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి

ఈ మధ్యకాలంలో చాలా మంది ఊబకాయానికి(Obesity) గురవుతున్నారు. భారీగా బురువు పెరిగాక, తగ్గేందుకు విపరీతమైన కసరత్తులు, డైట్‌ మెయింటైన్‌ చేస్తున్నారు.

మళ్లీ ఉల్లి లొల్లి…!

  • బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు ముందుగా బ్రేక్‌ఫాస్ట్‌(Breakfast) మీద దృష్టి పెట్టాలి. ఉదయం పూట ఆహారాన్ని మిస్‌ చేస్తే జీవక్రియలు పనిచేయడంలో నెమ్మదవుతుంది. దాంతో బరువు తగ్గడం కష్టమవుతుంది. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్లో తక్కువ క్యాలరీలు(Calories), ఎక్కువ పోషకాలున్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • బ్రేక్‌ఫాస్ట్‌ ముందు రెండు గ్లాసుల వేడినీళ్లు తీసుకోవాలి. అందులో నిమ్మరసం(Lemon Juice) కలిపి కూడా తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీంతో ఒంట్లోని మలినాలు బయటికెళ్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది.
  • రాత్రి తిన్న ఆహారంతో వచ్చిన శక్తి ఉదయం కల్లా ఖర్చవుతుంది. అందుకే ఉదయాన అలసటగా ఉంటుంది. కాబట్టి నిద్రలేచిన గంట సేపటికే బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మంచిది. జీవక్రియలు సవ్యంగా జరుగుతాయి.
  • బ్రేక్‌ఫాస్ట్‌లో చెక్కెరలు, కేలరీలు తక్కువుగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
  • బ్రక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్‌ రిచ్‌ ఫుడ్ తీసుకోవాలి. గుడ్లు(Eggs), యోగర్ట్, నట్స్‌ ఉండేలా చూసుకోవాలి.
  • నిద్రలేమి కూడా ఊబకాయానికి దారి తీస్తుంది. ఒంటికి తగినంత నిద్ర లభిస్తే ఎలాంటి అనారోగ్యం(Illness) దరిచేరదు.
  • పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి, కొవ్వు చేరకుండా చూస్తుంది. కూరగాయలు, పండ్లు తినడం వల్ల తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు అందుతాయి. దాంతో బరువు తగ్గడం తేలికవుతుంది.
  • ఉదయాన్నే అరగంట పాటు వ్యాయామం(Exercise) చేయాలి. తద్వారా శరీరంలోని కొవ్వు చెమట రూపంలో బయటకెళ్లిపోతుంది.
  • జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌(Fast Food) లాంటి వాటి జోలికి అస్సలు వెల్లకూడదు. క్రమం తప్పకుండా సరియైన వేళల్లో మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పవర్‌స్టార్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ..

Exit mobile version