ఉబ్బసం(Asthma) ఒక క్లిష్టమైన వ్యాధి. జన్యు మరియు పర్యావరణ కారకాల వలన ఇది సంభవిస్తుందని పరిశోధకులు(Researchers) భావిస్తున్నారు. గతంతో పోలిస్తే మన వైద్య రంగం చాలా అభివృద్ధి (development) సాధించింది. నిన్న మొన్నటి వరకు చికిత్సే లేదనుకున్న ఎన్నో వ్యాధులకు చికిత్స అందించగలుగుతున్నారు మన దేశం లోని వైద్యసిబ్బంది. కానీ ఆస్తమాకు మాత్రం ఇప్పటివరకు శాశ్వతమైన పరిష్కారం లేదు. అస్తమా ఏ వయసు వారికైనా రావచ్చు, చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరికైనా అస్తమా బాధించవచ్చు.అస్తమా శ్వాస నాళాలకు(Respiratory tracts) సంబంధించిన వ్యాధి.
ఆస్తమా వచ్చినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- మన చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతిరోజూ వాకింగ్(Walking) చేయాలి.
- కొవ్వు పదార్థాలను తినడం తగ్గించాలి. నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్స్(Fast-food), చేపలు స్వీకరించకపోవడం మంచిది.
- చల్లదనాన్నిచ్చే పుచ్చకాయ, బీరకాయ, ఖర్బూజా వంటివి తినకూడదు. ఫ్రిజ్ లో ఉంచిన పదార్థాలు పెరుగు అసిడిక్ ఆమ్లం అధికంగా ఉన్న నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పళ్ళ రసాలను(Fruit Juice) తీసుకోరాదు.
- ఆహారం కడుపు నిండా కాకుండా, కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి.
- పడుకోవడానికి కనీసం రెండు లేదా మూడు గంటలు ముందుగానే రాత్రి భోజనం(Dinner) చేయడం మంచిది.
- మునగాకులో కఫం(Phlegm) తొలగించే గుణాలు పుష్కలం ఉంటాయి. కాబట్టి మునగాకు బాగా తినాలి.
అస్తమాకు చికిత్స లేదు , నివారణ ఒక్కటే మార్గం
అస్తమాకు చికిత్స లేదు, అలాగని ఆస్తమాను నిర్లక్ష్యం చేస్తే క్రానిక్ ఎయిర్ వేస్ డిసీజ్(Chronic Airways Disease) గా మారి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్ ని సంప్రదిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, పౌష్టికాహారం తింటూ, మన చుట్టూ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తులసి ఆకుల(Basil Leaves)ను పరకడుపున తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.తాగే టీలో కొద్దిగా అలం, వెల్లుల్లి ముక్కలని వేసుకుని టీ రూపంలో తీసుకుంటే ఆస్తమా వ్యాధి నుండి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు. గ్లాస్ పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వాటిని బాగా మరిగించుకోవాలి. ఈ పాలను తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధి నుండి ఊరట లభిస్తుంది.
(‘కరివేపాకు’తో అందం, ఆరోగ్యం..!)