- జీ-20 సదస్సులో వ్యూహాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం
- అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధ్యక్షులతో ప్రధాని భేటి
వచ్చే ఏడాది భారత అధ్యక్షతన జీ20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎం (CM)లు, పార్టీల (Party president)అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra modi)భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో (Rastrapathi bhavan)ఈ సమావేశం నిర్వహించారు. జీ20 (G20) సదస్సులో వ్యుహాల ఖరారుపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో 200కు పైగా చర్చలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాటు, సన్నద్ధతపై సమావేశంలో మోడీ ప్రస్తావించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమావేశాలను విజయవంతం చేసేందుకు సహకరించాలని సీఎంలను, పార్టీ చీఫ్‌లను కోరినట్లు పేర్కొన్నాయి.
ప్రధానితో భేటిలో బెంగాల్ సీఎం మమతా (Bengal CM Mamata), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (Odisha CM Naveen Patnaik,), సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ( Sikkim CM Prem Singh Tamang), మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (Maharashtra CM Eknath Shinde), ఢిల్లీ సీఎం కేజ్రివాల్ (Delhi CM Kejriwal), ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM YS Jagan Reddy), తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin), కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ( Congress Chief Mallikarjun Kharge), సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరీ (CPM General Secretary Sitaram Yechury), టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu attended). వీరితో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా (Amit Shah, Rajnath Singh, Nirmala Sitharaman, Jaishankar, BJP chief JP Nadda) సమావేశంలో పాల్గొన్నారు.
(PM MODI:జీ20లో ప్రతి పౌరుడిని భాగం చేయండి)
వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో దేశాధినేతలు లేదా ప్రభుత్వాల స్థాయిలో జీ20 లీడర్స్ సమ్మిట్ (G20 Leaders Summit) జరగనుంది. భారత్ ఇతర దేశాలను ప్రభావితం చేయడానికి తన విజయగాథను చూపించడానికి జీ20 అధ్యక్షతను ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. అయితే రోటేషన్ (Rotation) పద్దతిలోనే భారత్‌కు ఈ అవకాశం వచ్చిందని, ఇందులో మోడీ ఘనత ఏమి లేదని విపక్షాలు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. భారత్ అధికారికంగా జీ20 అధ్యక్ష బాధ్యతలను ఈనెల 1న స్వీకరించింది. కాగా, ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) హజరు కాలేదు.