end

వరద బాధితులను నిష్పక్షపాతంగా ఆదుకున్నాం..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరమంతా అతలాకుతమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై, ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణ సాయంగా నిధులు మంజూరు చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనీ.. మనసున్న ప్రభుత్వమని మంత్రి కె.తారక రామారావు అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటి వరకూ చేసినదానికంటే అవసరమైతే మరో 100 కోట్లు కేటాయించడానికి సిద్ధమని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలకు ప్రజలు లోనుకావద్దని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు, తమకు నచ్చిన వాళ్లకే సాయం అందిస్తున్నారన్న ప్రతిపక్షాల మాటలను మంత్రి తిప్పికొట్టారు. బాధితులను నిష్పక్షపాతంగా ఆదుకున్నామనీ.. ఆదుకుంటామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

ఇవాళ తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ వరద సాయం తదితర అంశాలపై మీడియాతో మాట్లాడారు. 1916 తర్వాత ఈ ఏడాదే భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. హైదరాబాద్‌ చరిత్రలో అతిపెద్ద వర్షపాతం ఈ ఏడాదే నమోదైందని చెప్పారు. మానవ తప్పిదాల వల్లనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తినట్టు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 40లక్షల కుటుంబాలకు వరద సాయం అందినట్టు మంత్రి తెలిపారు. దసరాలోపే వరదసాయం అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటి వరకూ వరదసాయం అందిన బాధితుల వివరాలను సేకరించామన్నారు. వాస్తవంగా నష్టపోయిన వారికే వరద సాయం అందించామని చెప్పారు. 920 బృందాలను ఏర్పాటుచేసి వరద సాయం అందించినట్టు వెల్లడించారు. ఒక్కరోజే లక్ష మందికి సాయం పంపిణీ చేశామన్నారు. తాము సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే కాంగ్రెస్‌, బీజేపీలు బురదజల్లే రాజకీయం చేస్తున్నాయని కేటీఆర్‌ విమర్శించారు.

అధికారుల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పరిహారం ఇచ్చినవారితో కూడా రోడ్డు పై ధర్నాలు చేయించారన్నారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. మన హైదరాబాద్‌- మన బిజేపీ అంటూ నినాదాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌కు ఏం చేశారని మన హైదరాబాద్‌ అంటున్నారని కేటీఆర్‌ బీజేపీ నాయకులను నిలదీశారు.

Exit mobile version