end

ఘనవిజయం సాధిస్తాం: జో బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. యూఎస్ ప్రెసిడెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌‌ ఇంకా కొనసాగతోంది. అధ్యక్షుడి ఎన్నికలో కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం కౌంటిగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ జో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో బైడెన్‌ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. డెమొక్రాట్లు 300 ఓట్లతో విజయం సాధించబోతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే స్పష్టం అయ్యింది మనం గెలవబోతున్నామని‌. ప్రస్తుతం బైడెన్ 264 ఓట్లు సాధించగా.. ట్రంప్‌ 214 వద్ద ఆగిపోయారు. ఈ క్రమంలో బైడెన్‌ మాట్లాడుతూ.. ‘ఇంకా తుది ఫలితాలు వెల్లడించలేదు. కానీ ఇప్పటి వరకు గెలిచిన ఓట్ల సంఖ్యను బట్టి మనం గెలవబోతున్నామని స్పష్టం అవుతుంది. గడిచిన 24 గంటల్లో ఏం జరిగిందో చూడండి. ఐదు కీలక రాష్ట్రాల్లో మనం నాలుగింటిలో ముందంజలో ఉన్నాం’ అన్నారు. అంతేకాక ‘24 ఏళ్లలో అరిజోనాలో గెలిచిన మొదటి డెమొక్రాట్లం మనమే.. అలాగే 28 ఏళ్లలో జార్జియాలో గెలిచిన మొదటి డెమొక్రాట్లం కూడా మనమే. మనం బ్లూ వాల్‌ని దేశం నడిబొడ్డున రీ బిల్ట్‌ చేశామని బైడెన్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్న ఐదు కీలక రాష్ట్రాల్లో నాలుగింటిలో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. అరిజోనా, జార్జియా, నెవాడా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో బైడెన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక అమెరికా ఎన్నికల్లో విజేతగా ప్రకటించాలంటే 530 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లలో 270 సాధించాలి. అధికారంలోకి రాగానే కరోనా మహమ్మారిని కంట్రోల్‌ చేస్తానని బైడెన్‌ తెలిపారు. కోవిడ్‌ కారణంగా ఇప్పటికే 2,31,000 మంది అమెరికన్లు మరణించగా.. 9 మిలియన్ల మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. దీనంతటికీ ట్రంప్‌ మొండి వైఖరే కారణమని బైడెన్‌ వెల్లడించారు. కాగా, జో బైడెన్‌.. బరాక్‌ ఒబామా అధికారంలో ఉండగా, యూఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా సేవలందించారు.

Exit mobile version