- టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను కట్డడి చేసేందుకు తాము సరైన ప్రణాళికలు రూపొందించామంటున్నాడు టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్. ఆస్ట్రేలియా పర్యటనలో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను సమర్థంగా అడ్డుకున్న టీమిండియా.. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌పై దృష్టి సారించింది. శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో రూట్ విశ్వరూపం ప్రదర్శించాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 106.50 సగటుతో 426 పరుగులతో దూకుడుమీదున్నాడు. దీంతో భారత్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో అతడే అత్యంత ప్రమాదకారి కానున్నాడు. ‘రూట్ భీకర ఫామ్‌లో ఉండడం ఇంగ్లండ్ జట్టుకు అమితానందాన్నిచ్చే విషయమే. అయితే మేం రూట్‌ను కట్టడి చేసే ప్రణాళికల్లోనే ఉన్నాం. షమి, జడేజా లేకపోయినా మా బౌలర్లంతా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. పైగా స్వదేశంలో ఆడడం మాకు అనుకూలం’ అని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ధీమా వ్యక్తం చేశాడు.