end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంRituals:నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అంటే?
- Advertisment -

Rituals:నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అంటే?

- Advertisment -
- Advertisment -

ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు చేయక తప్పదు. వాటినే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు(Naimittika Karmas) అంటారు. నిత్య కర్మలు అంటే కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం, వ్యాయామం చేయడం, దేవతారాధన చేయడం, మనకు అప్పగించిన ఉద్యోగం చేయడం, తీరికవేళల్లో శాస్త్రపఠనం, సత్సంగము, వేళకు భోజనం చేయడం, వేళకు నిద్ర పోవడం. వీటినే నిత్య కర్మలు అంటారు.

ఇంక నైమిత్తిక కర్మలు అంటే ఏదో ఒక నిమిత్తం అంటే కారణంతో చేసేవి, పండుగలు(Festivals) జరుపుకోవడం, శివరాత్రి, కార్తీకమాసం, మాఘస్నానాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, గణపతిపూజలు, నవరాత్రిపూజలు(Navratri Pujas), పితృకార్యములు, ఇలాంటివి. ఇవి అన్నీ ప్రతి వ్యక్తి చేయవలసినవి. సమాజంలో బతుకుతున్న ప్రతి వ్యక్తి వీటిని చేయకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి కర్మలు చేయకుండా ఎవరూ ఉండలేరు.

మానవులలో మూడు గుణాలు ఉన్నాయి ఆ గుణాలను బట్టి కర్మలు చేస్తుంటారు. సాత్విక గుణం ఎక్కువగా కలవారు తాము చేయవలసిన కర్మలను చేస్తారు. అనవసరమైనకర్మలు, చేయకూడని కర్మలు చేయరు. లోకంలో సంచరిస్తూ కూడా అంటీ అంటనట్టు కర్మలు చేస్తుంటారు. తాము చేసే కర్మల వలన తమకే కాకుండా సమాజానికి కూడా లాభం కలగాలి అని ఆలోచిస్తారు. రెండవ రకం వారు రజోగుణపదానులు(Rajogun Apadana). ఇటువంటి వారు ఏ పనీ చేయకుండా ఉండలేరు. ఏదో ఒకపని చేస్తారు. అది సకామకర్మగానీ, నిష్కామ కర్మగానీ, మంచి పని గానీ, చెడ్డ పనీ గానీ, ఏదో ఒక పని చేస్తుంటారు. కాని, ఆ కర్మను తమ స్వార్థం కోసమే చేస్తారు. ఇతరుల గురించి, సమాజం గురించి పట్టించుకోరు.

ఇంక మూడవ రకం తమోగుణ ప్రధానులు. తాము చేయవలసిన పనులు తప్ప ఇతర పనులలో ఆసక్తి కలిగిఉంటారు. ఇతరులు ఏమైనా పర్వాలేదు. తాము మాత్రం బాగుపడాలి అని కోరుకుంటారు. కొన్నిసార్లు ఏపనీ చేయరు. పని అంటే గిట్టదు. తమకు పనిగండం ఉందంటారు సోమరిగా తిరుగుతుంటారు. తేలికగా ధనం సంపాదించడం, సుఖాలు అనుభవించడం వీరి అభిమతం(preference). ఇటువంటి వారు మనకు తరచు కనిపిస్తారు. కాబట్టి, చేయ వలసిన పనులు చేయడం, చేయకూడని పనులు చేయకపోవడం, ఏ పని చేసినా దానిని శ్రద్ధతో, ఫలితం ఆశించకుండా చేయడం, అత్యంత శ్రేష్టము. కాని కొంతమంది ఏ పని చేయడానికి ఇష్టం లేక, ఒక వితండ వాదం(Withanda argument) చేస్తుంటారు. పనులు చేస్తే బంధనములు కలుగుతాయి.

కాబట్టి ఏ పనీ చేయకుండా ఉంటే బంధనములు, వాసనలు కలుగవు కదా అని వాదిస్తుంటారు. అటువంటి వితండ వాదుల కోసమే ఈ శ్లోకము(Hymn) చెప్పబడింది. మానవుడు ఏ పనీ చేయకుండా ఉండలేడు. కాకపోతే చేసే కర్మలు స్వార్థబుద్ధితో కాకుండా, నిష్కామంగా, కరత్వభావన లేకుండా చేస్తే, చేసిన కర్మలయొక్క ఫలములు పరమాత్మకు అర్పిస్తే, ఆ కర్మలయొక్క బంధనములు అంటవు అని చెప్పాడు పరమాత్మ.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -