end
=
Thursday, July 4, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంHoly Bath:పుణ్యస్నానం చేయడం వల్ల ఫలం ఏమిటి?
- Advertisment -

Holy Bath:పుణ్యస్నానం చేయడం వల్ల ఫలం ఏమిటి?

- Advertisment -
- Advertisment -

పుణ్యస్నానం ప్రధానంగా రెండు మాసాల్లో చేస్తాం. కార్తికంలో సూర్యోదయానికంటే ముందు తులాలగ్నం(Libra) ఉంటుంది. ఆ సమయంలో స్నానం చేయాలి. దానివల్ల కార్తిక దామోదరుని అనుగ్రహం లభిస్తుంది. కఫవికారాలు దూరమౌతాయి. మాఘమాసంలో మకరలగ్నం(Capricorn) సూర్యోదయ వేళలో ఉంటుంది. అపుడు స్నానం చేయడం వల్ల ప్రయాగస్నాన ఫలం లభిస్తుంది. ఆషాడ, మాఘ, కార్తిక, వైశాఖ మాసాల్లో పౌర్ణమినాడు పుణ్యనదిలో, నదిసంగమ ప్రాంతాల్లో, సముద్రసంగమ ప్రాంతాల స్నానం విశేష పుణ్యదాయకం.

ఉదయాన్నే స్నానం ఎన్ని గంటలకు చేయాలి?

సమయాన్ని బట్టి స్నానానికి ఫలం ఉంటుంది. ప్రాతఃకాలంలో 5 గంటలకు పూర్వం చేసే స్నానాన్ని ఋషి స్నానం అంటారు. ఉదయం 5, 6 గంటల మధ్య చేసేది దేవస్నానం. అలాగే ఉదయం 6, 7 గంటల లోపు మానవ స్నానం. ఆ తర్వాత చేసేది రాక్షస స్నానం. అనారోగ్యాదుల వల్ల స్నానం చేయలేకపోతే నిర్మల హృదయం(Pure Heart)తో దేవుని స్మరించడం మానస స్నానం. తులసి, మారేడు దళాలు కలిసిన జలంతో సంప్రోక్షించుకుంటే ధ్యాన స్నానం. ఉత్తరాయణంలో ఎండా, వాన కలిసినప్పుడు తడిస్తే దివ్వ స్నానం. తడిగుడ్డతో దేహాన్ని తుడుచుకుంటే కపిల స్నానం. సంధ్యావందనాది సందర్భాలలో జలాన్ని ప్రోక్షించుకుంటే మంత్ర స్నానం. గాయత్రీ మంత్రాన్ని(Gayatri Mantra) జపిస్తూ నీటిని శిరస్సు మీద చల్లుకుంటే గాయత్రీ స్నానం.

భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి?

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -