end

బ్రహ్మ ముహూర్తమని దేన్నంటారు?

బ్రహ్మ ముహూర్తమని దేన్నంటారు?

తెల్లవారుజామున 3.20 నిమిషాలనుంచి 5.40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. రోజులో ప్రతి గంటకు గ్రహహోర మారుతుంది. అంటే క్షితిజ రేఖ వద్ద కనిపించే గ్రహం మారుతూ ఉంటుందని అర్థం. హోరాకు అధిదేవతైన గ్రహం మన పనులను నిర్దేశిస్తుంది. బ్రహ్మముహూర్తంపై ఏ గ్రహాల ప్రభావం పనిచేయదు. సర్వచైతన్యమయమైన అమ్మవారి శక్తి మాత్రమే పనిచేస్తుంది. ఆ శక్తి శుద్ధచైతన్యం. అందుకే తెల్లవారుజామున నేర్చుకున్న విద్య హృదయానికి హత్తుకుంటుంది. జ్ఞాపకం ఉంటుంది. ఏకాగ్రత కుదురుతుంది. చదువుకు, జపసాధనలకు బ్రహ్మ ముహూర్తాన్ని మించింది లేదు.

డబ్బు – చాణక్య రహస్యాలు

గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి?

ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా వినియోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగోట్టేది మామిడాకు తోరణమే. మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. పర్వదినాల్లో, యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయడం ఆచారం. దానికి ప్రతీకగా తోరణాలు కట్టే ఆచారం వచ్చింది.

చాణక్య నీతులు – రహస్యాలు

సేకరణః – చోల్లేటి మహేందర్‌రెడ్డి

Exit mobile version