- గంగస్నానం తర్వాత పంచిపెట్టడం శ్రేయస్కరం
హిందూ మతంలో (Hindu culture) ప్రత్యేకంగా జరుపుకునేదే ఈ మకర సంక్రాంతి (makara sankranthi)పండుగ. అయితే ఈ మకర సంక్రాంతి నాడు సూర్యభగవానుడు (suryabhagavanudu) దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించనున్నాడు. దీంతో శుభ సమయం మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుని సంచారాన్ని సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. వీటిల్లో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే మకర సంక్రాంతి విశిష్టమైంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్ని రకాల శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం(Ganga snanam), దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతి నాడు ఎవరైతే తన రాశి ప్రకారం సూర్య భగవానుని పూజిస్తారో.. స్నానం చేస్తారో, దానం చేస్తారో వారి జీవితం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం.
మేషం, వృశ్చిక రాశులు:
ధరణి పుత్రుడు కుజుడు .. మేష, వృశ్చిక రాశులకు అధినేత. అటువంటి పరిస్థితిలో.. ఈ రెండు రాశులపై అంగారకుడు ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో.. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం చేసిన తర్వాత నువ్వులు, బెల్లం, కిచడీ, పప్పు, పాయసం, ఎరుపు లేదా గులాబీ రంగు ఉన్ని బట్టలు మొదలైన వాటిని దానం చేయడం శ్రేయస్కరం.
వృషభం, తులా రాశులు:
వృషభం, తులారాశులకు అధిపతి శుక్రుడు. జ్యోతిషశాస్త్రంలో.. శుక్ర గ్రహం ఆనంద కారకం. కీర్తి, సుఖ సంతోషాలను అందించే గ్రహం శుక్రుడు పరిగణింపబడుతున్నారు. మకర సంక్రాంతి నాడు పంచదార, అన్నం, పాలు-పెరుగు, తెలుపు లేదా గులాబీ రంగు ఉన్ని దుస్తులు, కిచడీ, నువ్వులు-బెల్లం దానం చేయడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడతాడు.
మిథున, కన్య రాశులు:
బుధుడు మిథున, కన్యారాశులకు అధిపతి. అటువంటి పరిస్థితిలో.. జాతకంలో బుధ గ్రహం బలపడటానికి.. మకర సంక్రాంతి నాడు స్నానం చేసిన తర్వాత శనగ పప్పు, కిచడి, వేరుశెనగలు, బట్టలు మొదలైనవి దానం ఇవ్వడం శుభప్రదం.
కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కనుక మకర సంక్రాంతి రోజున ఖీర్, నువ్వుల లడ్డూలు, మిఠాయిలు, కిచడీలు వంటివి దానం చేయడం వల్ల చంద్రుడు ప్రసన్నం అవుతాడు.
సింహరాశి : జ్యోతిషశాస్త్రం ప్రకారం సింహ రాశికి సూర్యుడు అధిపతి. అటువంటి పరిస్థితిలో, సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి మకర సంక్రాంతి నాడు సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించి గంగానదిలో స్నానం చేసి కిచడీ, ఎర్రటి వస్త్రం, బెల్లం, పప్పు మొదలైన వాటిని దానం చేయడం శుభప్రదం.
ధనుస్సు , మీన రాశి: ధనుస్సు , మీన రాశులకు బృహస్పతి అధిపతి. ఈ రాశి వారు మకర సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం, కిచడి, శనగపప్పు, బొప్పాయి, పసుపు చందనం వంటివి దానం చేస్తే శుభం కలుగుతుంది.
మకర, కుంభ రాశులు: కుంభ, మకర రాశులకు శశనీశ్వరుడు అధిపతి. మకర సంక్రాంతి నాడు శనిదోషం తొలగిపోయి శనిగ్రహ అనుగ్రహం కలగాలంటే.. కిచిడి, నల్ల గొడుగు, నువ్వులు లేదా ఆవనూనె, ఉన్ని దుస్తులు బట్టలను అవసరమైన వారికి దానం చేయాలి.
ఇదిలావుంటే.. ఈ సంక్రాంతి తర్వాత ఏ రాశి వాళ్ల జాతకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేయాల్సి వస్తుంది. మీ నుంచి గతంలో సహాయం పొందిన వారు మీకు అండగా నిలుస్తారు. స్థాన చలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. దగ్గర బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక సంబంధమైన విషయాలలో వాగ్దానాలు చేయవద్దు. వ్యక్తిగత ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలను పూర్తి చేయాల్సి వస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థికంగా రాబడి బాగానే ఉంటుంది. ఖర్చుల్ని అదుపు తీసుకోవాల్సి ఉంది. ఆరోగ్యం పరవాలేదు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా కాలక్షేపం చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. సహచరులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆర్థికంగా ఇతరులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టం ఎక్కువవుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. సమయం అనుకూలంగా లేనందువల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థికపరంగా శుభయోగాలు కనిపిస్తున్నాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. పిల్లలు విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ప్రేమించిన వ్యక్తి తోనే వివాహం నిశ్చయం అవుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంది. రుణ సమస్యలు కొద్దిగా తగ్గు ముఖం పడతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. చదువుల్లో పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారంలో మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దగ్గర బంధువులు ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులతో మంచి కాలక్షేపం చేస్తారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలన్న ఆలోచనలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో స్నేహితులకు సహాయం చేసి ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా జీవితం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆర్థిక పరిస్థితి యథాతథంగానే ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి వ్యాపారాల్లో శ్రమ బాగా పెరుగుతుంది. తిప్పట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఒక పట్టాన సహాయం లభించదు. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ దుబారా ఎక్కువగా ఉంటుంది. తనకు మాలిన ధర్మం ఉపయోగపడదని గ్రహించండి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పట్లో ఉద్యోగం మారే అవకాశం లేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న వారితో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగిస్తాయి.
(Smoking:సెకండ్ హ్యాండ్ స్మోక్ తో ఆరోగ్య రంగంపై రూ.5670 కోట్ల భారం)