end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంఎంఐఎం వ్యూహం ఫలిస్తుందా..!
- Advertisment -

ఎంఐఎం వ్యూహం ఫలిస్తుందా..!

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్:‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు మజ్లిస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 చోట్ల గెలుపొందిన ఆ పార్టీ, ఈసారి 52 డివిజన్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది. అందులో కనీసం 50 స్థానాలనైనా కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్‌ఎస్‌తో ఎలాంటి ఎన్నికల అవగాహన, పొత్తులు లేవని.. స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చాటుకుంటామని స్పష్టం చేస్తోంది. పాతబస్తీకే పరిమితం కాకుండా సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, రాజేంద్రనగర్‌ తదితర అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలు అధికంగా నివసించే డివిజన్లను లక్ష్యంగా చేసుకుంది. ఆయా శాసనసభ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో మజ్లిస్‌ అభ్యర్ధులను గెలిపించే బాధ్యతలను స్థానిక పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత అసదుద్దీన్‌ అప్పగించారు. ఎమ్మెల్యేలు లేని ప్రాంతాల్లో పోటీ చేస్తున్న డివిజన్లలో అభ్యర్థుల తరఫున ఆయన స్వయంగా ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండటం గమనార్హం.

టీఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోయినప్పటికీ బీజేపీ అభ్యర్థుల విజయాన్ని నిలువరించేందుకు మజ్లిస్‌ ఆయా డివిజన్లలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తొమ్మిది సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలపలేదు. బీజేపీ విజయావకాశాలు ఉన్న డివిజన్లలో తాము పోటీ చేయని పక్షంలో, మైనారిటీల ఓట్లు టీఆర్‌ఎస్‌కు దక్కేలా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే పాతనగరంలో యాకుత్‌పురా నియోజకవర్గం పరిధిలోని గౌలిపురా డివిజన్‌ మినహా మిగిలిన అన్ని డివిజన్లలో మజ్లిస్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చార్మినార్‌ సెగ్మెంట్‌లోని బీజేపీ సిటింగ్‌ స్థానం అయిన ఘాన్సీబజార్‌ డివిజన్‌ బాధ్యతలను మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌కు అప్పగించింది. ఐదేళ్ల క్రితం తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గౌస్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడమే గాక, ఆయన భార్య పర్వీనాకు ఘాన్సీబజార్‌ టికెట్‌ను కేటాయించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -