నిన్నటితో బిహార్ తుది విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల అనంతరం ఎగ్జిట్‌పోల్స్ సర్వేల వివరాలు చూస్తే షాకవ్వాల్సిందే. ప్రతి మీడియా సర్వేలోనూ ఆర్జేడీ కూటమే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఆర్జేడీ పార్టీ.. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీచేసింది. నితీష్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న జేడీయూ, బీజేపీతో జతకట్టింది. రెండు బలమైన పార్టీలు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా.. రాష్ట్రంలో జేడీయూ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై కూడా ప్రజలకు మంచి అభిప్రాయమే ఉంది. కానీ, సర్వేలన్నీ ఆర్జేడీ వైపే మొగ్గు చూపుతుండడం గమనర్హం.
రిపబ్లిక్ టీవీ సర్వే: జేడీయూ: 91-117, ఆర్జేడీ: 118-138, ఎల్జేపీ: 5-8, ఇతరులు: 3-6
ఏబీపీ టీవీ సర్వే: జేడీయూ: 104-128, ఆర్జేడీ: 108-131, ఎల్జేపీ: 1-3, ఇతరులు: 4-8
టైమ్స్ నౌ: జేడీయూ: 116, ఆర్జేడీ:120, ఎల్జేపీ: 1, ఇతరులు: 6
పీపుల్స్ పల్స్: జేడీయూ: 90-110, ఆర్జేడీ: 100-115, ఎల్జేపీ: 3-5, ఇతరులు: 8-18
జన్ కీ బాత్: జేడీయూ: 91-117, ఆర్జేడీ: 118-138, ఎల్జేపీ: 5-8, ఇతరులు: 3-6