end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంMungode:మునుగోడు ఫలితం ఎవరికి మేలు చేస్తుంది..
- Advertisment -

Mungode:మునుగోడు ఫలితం ఎవరికి మేలు చేస్తుంది..

- Advertisment -
- Advertisment -

  • దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఉప ఎన్నిక
  • తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు చాన్స్


తెలంగాణ (Telangana) రాష్ట్రంలో జరిగిన మునుగోడు (Mungode) ఎలక్షన్‌ (Election) దేశం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. పేరుకు ఒక రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి జరిగిన బైపోల్ (by pole)మాత్రమే.! కానీ, దాని వెనుక అంతకుమించిన పొలిటికల్ (Political) ఈక్వేషన్స్ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే ఫలితమిది. అందుకే అన్ని పార్టీల్లోనూ టెన్షన్.! దాదాపు నెల రోజుల పాటు మినీ యుద్ధమే నడిచింది. ఇప్పుడు రిజల్ట్‌ (Result)టైమ్‌.! రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. జనం తమ తీర్పు ఇచ్చేశారు. అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో (EVM)నిక్షిప్తం చేశారు. ఫలితం ఎలా ఉండబోతోంది? ఎవరు గెలుస్తారు? ఇప్పడు అంతటా మునుగోడు ఉప ఎన్నికపైనే భారీ చర్చ జరుగుతోంది.

మునుగోడులో మొత్తం ఓట్లు (Votes) 2,41 వేల 805. ఇందులో 2,25 వేల 192 ఓట్లు పోలయ్యాయి. అంటే 93.1 శాతం. 2018 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 2 శాతం ఓటింగ్ పెరిగింది. ఈ భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం అన్న చర్చ జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 7మండలాలు (Mandal) ఉన్నాయి. ఇందులో చౌటుప్పల్ (Choutuppal), సంస్థాన్‌ నారాయణపురం (Narayanapuram) చాలా కీలకం.! ఈ రెండు మండలాల్లోనే దాదాపు లక్ష ఓట్లు ఉన్నాయి. అందుకే పోలింగ్ శాతం. సామాజిక సమీకరణాలపై పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ఈసారి యూత్‌ కూడా పెద్ద సంఖ్యలో ఓట్లేశారు.. వాళ్లు ఎటువైపు మొగ్గారన్నది కూడా కీలకం కానుంది. మునుగోడు బరిలో చాలా మందే నిలిచారు. కానీ ప్రధాన పోటీ మాత్రం TRS, BJP, కాంగ్రెస్ మధ్యే సాగింది. ప్రస్తుతానికైతే ఎవరి లెక్కలు వారివి. ఎవరి అంచనాలు వారివే. అందరూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండ టౌన్‌లోని వేర్ హౌసింగ్ గోడౌన్‌లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ (Counting)స్టార్ట్ అవుతుంది. మొదట 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇక EVMల ఓట్ల కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 298 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారు. ఉదయం 9 గంటలకల్లా తొలి ఫలితం వెల్లడయ్యే ఛాన్స్‌ ఉంది. చివరి ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటకు వస్తుంది.

మొదట చౌటుప్పల్‌ మండలంలోని ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ (Ghattuppal) మండలాల ఈవీఎంలను టేబుళ్ల వద్దకు తరలిస్తారు. లెక్కింపులో పాల్గొనే సిబ్బంది, అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఇక కౌంటింగ్‌ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 24 గంటలూ సీసీ (CC Camera) కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీఆర్పీఎఫ్‌ (CRPF)బలగాలు పహారా కాస్తున్నాయి.

మునుగోడు పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం. పెరిగిన పోలింగ్ శాతం ఫలితాల్లో కీరోల్ కాబోతుందా?. అత్యధిక ఓటింగ్ పర్సెంటేజ్ ఫలితాలను తారుమారు చేస్తుందా?. వార్ వన్ సైడేనా.. లేదా టగ్ ఆఫ్ వారా? మునుగోడు బైపోల్ ఫలితంపై భారీ ఉత్కంఠ నెలకొంది. ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం ఆసక్తి రేపుతుంది. పెరిగిన ఓటింగ్ ఎటువైపు మొగ్గిందనే అంచనాలు నెలకొన్నాయి. 2018 సార్వత్రిక ఎన్నికల కంటే మొన్న జరిగిన మునుగోడు బైపోల్ లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో మునుగోడులో 91.07 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇప్పుడు ఏకంగా 93.13 శాతంతో తెలంగాణలో అత్యధిక పోలింగ్ జరిగిన ఎన్నికగా రికార్డుకెక్కింది. 2018 ఎన్నికల్లో ఖమ్మం (Khammam) జిల్లా మధిర (Madhira)లో 91.27 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొన్నటి వరకు మధిరదే రికార్డు. తాజాగా ఆ రికార్డును మునుగోడు బైపోల్ బద్దలు కొట్టింది.

(Pawan Kalyan:పవన్ కళ్యాణ్‌ను చంపేస్తారా..)

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 2,41,805 లక్షల మంది ఓటర్లు ఉండగా 2,25,192 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇక మండలాల వారీగా పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే నారాయణపురం మండలంలో అత్యధికంగా ఓట్లు పడ్డాయి. ఇక్కడ మొత్తం 36,430 ఓట్లుండగా.. 93.76శాతంతో 34,157మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత చౌటుప్పల్‌లో 93.68శాతంతో 59,433 ఓట్లకు.. 55,678 ఓట్లు పడ్డాయి. చండూరులో 93.51శాతంతో 33,509 ఓట్లు ఉండగా.. 31,333 ఓట్లు పోలయ్యాయి. మునుగోడులో 93.50శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 35,780 ఓట్లుండగా 33,455మంది ఓటు వేశారు. ఇక గట్టుప్పల్‌లో 14,525 మంది ఓటర్లు ఉండగా.. 92.61శాతంతో 13,452 మంది ఓటేశారు. నాంపల్లి (Nampally) మండలంలో 92.37శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ 33,819 మంది ఓటర్లు ఉండగా.. 31,240 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మర్రిగూడలో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ 28,309 ఓట్లుండగా 91.41శాతంతో 25,877 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ13 కేంద్రాల్లో రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్ జరిగింది.

అయితే, పెరిగిన ఓటింగ్ సరళి ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి రాజకీయ పార్టీల్లో నెలకొంది. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ ఫలితాల్లో కీ రోల్ కాబోతుందనే టాక్ వినిపిస్తుంది. యువత సైలెంట్ (Silent )ఓటింగ్ ఫలితాలను తారు మారు చేస్తాయంటున్నారు మునుగోడు ఓటర్లు. పెరిగిన ఓటింగ్.. యువత సైలెంట్ ఓటింగ్ వార్ వన్ సైడేనా.. లేదా టగ్ ఆఫ్ వార్ ను తలపిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.

ఇక పోలైన ఓట్ల లెక్కింపు పరిశీలిస్తే.. నారాయణపురం: (Narayanapuram) మొత్తం ఓట్లు 36,430 పోలైన ఓట్లు 34,157 పోలింగ్ శాతం 93.76. చౌటుప్పల్‌ (Choutuppal) : మొత్తం ఓట్లు 59,499 పోలైన ఓట్లు 55, 678 పోలింగ్ శాతం 93.68. చండూరు (Chandur): మొత్తం ఓట్లు 33,509 పోలైన ఓట్లు 31,333 పోలింగ్ శాతం 93.51. మునుగోడు: (Munugode) మొత్తం ఓట్లు 35,780 పోలైన ఓట్లు 33,455 పోలింగ్ శాతం 93.50. గట్టుప్పల్‌: (Ghattuppal) మొత్తం ఓట్లు 14,525 పోలైన ఓట్లు 13,452 పోలింగ్ శాతం 92.61. నాంపల్లి: (Nampally) మొత్తం ఓట్లు 33,819 పోలైన ఓట్లు 31,240 పోలింగ్ శాతం 92.37. మర్రిగూడ: (Marriguda)మొత్తం ఓట్లు 28,309 పోలైన ఓట్లు 25,877 పోలింగ్ శాతం 91.41.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -