end
=
Saturday, January 18, 2025
సినీమాSitara:సితారను ఓదార్చేదెవరు..
- Advertisment -

Sitara:సితారను ఓదార్చేదెవరు..

- Advertisment -
- Advertisment -
  • వెక్కివెక్కి ఏడుస్తున్న మహేష్ కూతురు
  • ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్న వీడియో

టాలీవుడ్ హీరో మహేష్‌బాబు (Prince Mahesh Babu) కూతురు సితార (Sitara) నాయనమ్మ ‘ఇందిరా దేవి’ (Indira Devi)ని తలచుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఇకపై తను లేదనే నిజాన్ని కఠినంగానే దిగమింగుతూ పార్ధీవదేహంవద్ద కన్నీటి పర్యంతమైంది. అంతేకాదు ఆమె అంటే తనకెంత ఇష్టమో ఈ ఒక్క దృశ్యంతో మనందరికి తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో (video)ను మహేష్‌ అభిమానుల సంఘాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా.. ఆమె దు:ఖం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. 

(Indira Devi: హీరో మహేశ్‌బాబు తల్లి ఇకలేరు)

మహేష్‌కు జన్మనిచ్చిన తల్లి ఇందిరా దేవి (Indira Devi) బుధవారం (wednesday) వేకువజామున అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే మహేష్‌కు అమ్మంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సందర్భాల్లో తల్లితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన చెప్పడం బహుశా మనందరం చూశాం. ఆమెను ఎన్నడు నిర్లక్ష్యం చేయకుండా ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకోగా సెప్టెంబరు 28న 80 ఏళ్ల వయసులో మరణించింది.

అయితే వయసైపోయిన ఆమె మరణం అందరిలాగే మాములుగా భావించని సితార పుట్టెడు దు:ఖం అందరనీ భావేద్వేగానికి లోను చేస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ, హుషారుగా, ఛలాకీగా ఉండే సితార నాయనమ్మ ఇక లేదని తెలిశాక భౌతికకాయాన్ని (Ded body) చూసి బోరుమని విలపించింది. తండ్రి ఒడిలో కూర్చుని ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక ఆ లేత హృదయం తల్లడిల్లిన దృశ్యాలు మహేష్ అభిమానులను, మనసున్న ప్రతీ ఒక్కరి కళ్లను చెమ్మగిల్లేలా చేశాయి. ఆ ఒక్క వీడియో (Sitara Crying Video) అమ్మమ్మ, నాయనమ్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకునేలా చేసింది. భౌతికకాయం కళ్ల ముందు కనిపిస్తుంటే బరువెక్కిన గుండెతో బాధను దిగమింగుకుంటూ.. నాయనమ్మ తనను వదిలి వెళ్లిపోయిందనే సితార బాధను మాటల్లో చెప్పలేం. ఇక ఇందిరా దేవి పుట్టినరోజు నాడు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘Happy Birthday Nainamma!! There’s no other like you.. Love you so much’ అని సితార చేసిన పోస్ట్ మరోసారి వైరల్ (viral) అవుతోంది.

ఇదిలావుంటే.. గత కొద్దిరోజులకింద పిన తల్లిని, ఇటీవలె సొంత అన్నను పొగొట్టుకున్న మహేష్.. తండ్రిని, కూతురిని, తోబుట్టువులను ఓదార్చుతూ బయటకు నిబ్బరంగానే కనిపించినప్పటికీ తల్లి లేని లోటు మాత్రం ఎవరూ పూడ్చలేనిదనే చెప్పాలి. మహేష్ (Mahesh) కుటుంబంలో 2022లో జరిగిన రెండో విషాదం ఇది. జనవరిలో మహేష్ సోదరుడు రమేష్ బాబు (Ramesh babu) చనిపోయిగా ఇప్పుడు మహేష్ తల్లి మృతి చెందడం తండ్రి ఘట్టమనేని కృష్ణ (krishna)ను  మరింత కుంగదీశాయి. ఇక వాళ్ల కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -