ఐపీఎల్‌లో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అబుధాబి వేదికగా జరిగే ఈ మ్యాచులో ఎవరు గెలిచి, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొడతారో చూడాలి మరి. ఈ సీజన్లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్ గెలిచాయి. కీలకదశలో ఎస్‌ఆర్‌హెచ్ పుంజుకోగా, బెంగళూరు జట్టు వరుస పరాజయాలు చవిచూసింది. బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లి, ఏబీడీ, పడిక్కల్‌లపైనే అతిగా ఆధారపడుతోంది. మిగితా బ్యాట్స్‌మెన్ అంచెనాలను తగ్గట్లు ఆడలేకపోతున్నారు. అపోజిట్ టీమ్స్ కూడా కోహ్లి, డివిలియర్స్‌ను టార్గెట్ చేస్తున్నాయి. దీంతో వారిని పరుగులు రాబట్టనీయకుండా నిలవరిస్తున్నాయి. ఇరు
జట్ల బలాబలాలు చూస్తే.. సన్‌రైజర్స్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. వరుస పరాజయాలు చవిచూసిన కోహ్లి అండ్ కో కాస్త నిరాశలో ఉంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. అతను ఛేదనకే మొగ్గుచూపాడు. మంచు కారణంగా రెండో సారి బౌలింగ్ చేసే జట్టు బౌలర్లు ఇబ్బంది పడతారనీ.. అందుకే టాస్ గెలిచాక బౌలింగ్ ఎంచుకున్నట్లు వార్నర్ తెలిపాడు. కోహ్లి కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునే అవకాశమే ఉండేది. కానీ, టాస్ కీలకం కదా..!