end

Lemons:వాహనాలకు నిమ్మకాయలు ఎందుకు కడతారు?

నిమ్మకాయలు(Lemons), తియ్య గుమ్మడి వంటి వాటిని ఉగ్రదేవతాశాంతికి వినియోగిస్తారు. వాహన ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికిగాను సాత్తిక దేవతల కంటే ఉగ్రదేవతలనే ఎక్కువగా నమ్ముతారు. సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహనపూజలు(Vahana Pooja) జరిపిస్తారు. దైవానికి నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడతారు. దిష్టితీసి చక్రాలతో తొక్కిస్తారు. ఇందువల్ల మేలు జరుగుతుందని ఆశిస్తారు. పుల్లగా ఉండే నిమ్మకాయ, కారం నిండివుండే మిరపకాయలను వాహనాలకు, దుకాణాలవద్ద వేలాడదీయడం వెనుక జ్యోతిషశాస్త్ర కారణం ఉంది. గ్రహాలలో ఎర్రనిది. ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు(Mars) ప్రమాద కారకుడని శాస్త్రనమ్మకం. కుజుని అధిదైవం హనుమంతుడు(Hanuman). అలాగే గ్రహాల్లో శుక్రగ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవి గ్రహానికి చెందినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు.

Exit mobile version