end
=
Saturday, February 22, 2025
వార్తలురాష్ట్రీయంHarishrao:బండిసంజయ్ జిల్లాకు మెడికల్ కళాశాల ఎందుకు తీసుకురాలేదో
- Advertisment -

Harishrao:బండిసంజయ్ జిల్లాకు మెడికల్ కళాశాల ఎందుకు తీసుకురాలేదో

- Advertisment -
- Advertisment -

జగిత్యాలలో మీడియాతో మంత్రి హరీశ్ రావు(Minister Harish rao) మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యసేవలపై కేంద్ర మంత్రి మహేంద్రనాధ్ ఏదేదో మాట్లాడారు.వారి రాష్ట్రం యూపీ వైద్య సేవల్లో ఆఖరి స్థానంలో ఉంది.తెలంగాణ అగ్ర స్థానం లో ఉంది.కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్క ఐసీయూ(ICU) కానీ, డయాలసిస్ సెంటర్ గాని ఎందుకు తీసుకురాలేదు.ప్రభుత్వం పై విమర్శలు తప్ప మీరు చేసిందేంటో ప్రజలకు చెప్పాలి.రాష్ట్ర సర్కారు ఉద్యోగాలు భర్తీ చేస్తే బండి సంజయ్ కుళ్లుకుంటున్నాడు.యువకులకు రాజకీయాలు తప్ప ఉద్యోగాలు వద్ద బండి సంజయ్(Bandi Sanjay) సమాధానం చెప్పాలి.ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ పార్టీ.తెలంగాణ వచ్చాక వైద్య ఆరోగ్య శాఖ ముఖ చిత్రం మారింది.30 పడకల కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రినీ రూ.20 కోట్ల తోవంద పడకలుగా అప్ గ్రేడేషన్ మార్పు. నేడు శంకుస్థాపన చేసుకున్నాం.తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ లో మూడే డయాలసిస్ సెంటర్ లు ఉండే. ఇపుడు 102 చేశాం.ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం కు ఒక డయాలసిస్ సెంటర్ తెచ్చాం.

  • తెలంగాణ(Telangana) లో 200 ఉన్న ICU బెడ్ లను 6000 లకు పెంచాం
  • కోరుట్ల లో 100 పడకలు చేసుకున్నాం.
    జగిత్యాల లో 500 పడకలు చేసుకున్నాం.
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు(Karimnagar district) ఇప్పటి వరకూ ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల ను తేలేదు.
  • ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కళాశాలు పని చేస్తున్నాయి.
  • మరో రెండు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పని చేస్తాయి.
  • తెలంగాణ లో 950 మంది డాక్టర్ లను కొత్తగా నియమించాం.

ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
90 మంది డాక్టర్ లను నియమించాo.

  • జిల్లా కేంద్రానికి ఒక్క మెడికల్ కళాశాల(Medical College)తెచ్చి వైద్య విద్యను పేద విద్యార్ధుల కు అందుబాటులోకి తెచ్చాం
  • సిఎం కేసిఆర్ వైద్య ఆరోగ్య కు అధిక ప్రాధాన్యం ఇచ్చి , నిధులను పెంచి పేదలకు ఆరోగ్యం ను చేరువ చేసింది.
  • హెల్త్ సెక్టార్ లో తెలంగాణ బెస్ట్ పెర్ఫార్మెన్స్
    స్టేట్ అని కేంద్ర ప్రభుత్వ మే తేల్చింది.
  • 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ నోటిికేషన్లు జారీ చేస్తుంది.
  • 2023 సంవత్సరoను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ తెలంగాణ గా మార్చింది.
  • ఒక్క వైద్య ఆరోగ్య శాఖ లో తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకూ
    6431 డాక్టర్ లు,
    7600 స్టాఫ్ నర్స్ లు,
    5192 పారా మెడికల్ సిబ్బంది.
    1900 మంది ఇతర సిబ్బంది నీ
    మొత్తం 21,200 మందిని కొత్తగా నియమించాo
  • తెలంగాణా తో సిఎం కేసిఆర్(CM KCR) కు పేగు బంధం ఉంది.
  • దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో 6 శాతం ఉన్న నిరుద్యోగితను 8.3 శాతానికి పెరిగింది.
  • తెలంగాణ లో 4.1 మాత్రమే నిరుద్యోగిత రేటు ఉంది.
  • 40 లక్షల కు పైగా లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ లు అందిస్తున్నాం
  • రైతులకు రైతు బంధు కింద పెట్టు బడి ఆర్థిక సహాయం అందిస్తున్నాం.
  • కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) తో సాగుకు ప్రభుత్వం సమృద్దిగా జలాలు అందిస్తుంది.
  • సాగు, త్రాగు నీరు తో ప్రజలకు, రైతులకు సమృద్దిగా జలాలు అందిస్తున్నాం
  • నూతన భవనం ప్రారంభం కాగానే మిగతా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
  • పేద ప్రజల సుస్తి నయం చేసేందుకే బస్తి దవాఖానాలు
  • జగిత్యాల జిల్లాకు 6 బస్తి దవాఖానాలు ఇచ్చాం. ఇప్పటికే 3 ప్రారంభించాం
  • జగిత్యాల జిల్లా లో ANM సబ్ సెంటర్ లను పల్లె దవాఖానా లుగా అప్ గ్రేడ్ చేస్తాం
  • యూనిసెఫ్ కూడ తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల ను కొనియాడింది.
  • కోరుట్ల హజీపుర లో బస్తీ దవాఖానా ను
  • ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.
  • కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్(Dialysis Center) ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.
  • పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక శాసన సభ్యులు విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ జి రవి.

(Kanti Velugu:ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -