end
=
Saturday, March 29, 2025
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంHair Offer:భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి?
- Advertisment -

Hair Offer:భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి?

- Advertisment -
- Advertisment -

ఈ ప్రశ్నకు పద్మపురాణంలోని వేంకటాచల మహాత్మ్యం “శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః” అంటూ సమాధానం చెప్పింది. అంటే తలకెక్కిన పాపాలనీ(Heady sinners) తలజుట్టుని ఆశ్రయించుకుని ఉంటాయి. వినయభావంతో భగవంతునికి సమర్పణగా ఆ జుట్టును వదిలించుకోవడం అంటే పాపభారం(Burden of sin) నుంచి బయటపడడమన్నమాట. అందమైన తలకట్టు సౌందర్యాన్ని పెంచుతుంది. ఫలితంగా రూపాహంకారం వ్యక్తికి కలుగుతుంది. శరోముండనం ఆ సౌందర్యాన్ని దూరం చేస్తుంది. దానితో అందంగా ఉన్నాననే అహంకారమూ తొలగిపోతుంది. అహంకారం నుంచి దూరం కావడం కోసం, పాపాలనుంచి విముక్తి పొందడం కోసం భగవంతునికి స్త్రీ, పురుషులిద్దరూ తలనీలాలు(Hair) సమర్పించుకోవచ్చు.

గుళ్లో శఠ గోపం ఎందుకు పెడతారు?

Satagopam
Satagopam devotees

ఆలయంలో దైవదర్శనం చేసుకున్న తరువాత, తీర్థప్రసాదాలు ఇచ్చేటప్పుడు పురోహితులు భక్తుల తలపై శఠగోపాన్ని(Shattagopa) పెడతారు. వాటిపై స్వామి పాదుకలు ఉంటాయి. ఆ శఠగోపం మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికీ వినిపించనంత చిన్నగా మనస్సులోని కోరికలను ఆ స్వామి పాదుకలకు(God’s Feet) చెప్పి, నమస్కరించాలి. ఆ శఠగోపాన్ని తలపై పెట్టించుకోవాలి. స్వామి పాదుకలనే మనం నమ్ముకున్నాం. వాటిని మనం తలపై పెట్టుకోవడానికి ఇది ప్రతీక(symbolic).

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -