end
=
Friday, September 20, 2024
క్రీడలుముంబై ముందు చెన్నై నిలుస్తుందా..
- Advertisment -

ముంబై ముందు చెన్నై నిలుస్తుందా..

- Advertisment -
- Advertisment -
  • టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌
  • గెలుపుపై కసిగా చెన్నై జట్టు

టీఆఎర్‌ఎస్‌ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్‌

ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు షార్జా వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఈ టోర్నీలో 41వ మ్యాచ్‌. తొలిదశ లీగ్‌ మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్‌ ముంబైని.. చెన్నై చిత్తుగా ఓడించింది. కానీ, అనంతరం జరిగిన మ్యాచుల్లో ముంబై పుంజుకోగా, చెన్నై ఘోరంగా విఫలమైంది. చెన్నై జట్టు ఇప్పటివరకు 10 మ్యాచులాడి కేవలం 3 విజయాలతో 6పాయింట్లతో పాయింట్స్‌ టేబుల్లో చివరి స్థానంలో ఉంది. కానీ, ముంబై జట్టు 9 మ్యాచులాడి 6 విజయాలతో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కాగా, ఈ మ్యాచ్‌ విజయం చెన్నైకి నామమాత్రం కాగా, ముంబైకి చాలా కీలకం.

ఈ నెల 29న ‘ధ‌ర‌ణి’ పోర్టల్‌ షురూ..

చెన్నై జట్టులో అందరూ సీనియర్‌ ఆటగాళ్లున్నప్పటికీ మ్యాచులు గెలవడంలో వరసగా విఫలమౌతున్నారు. ఓపెనర్‌ ఫాఫ్ డుప్లెసీ, షేన్‌ వాట్సన్‌ ఆరంభ మ్యా్చుల్లో అదరగొట్టారు. కానీ, వారికి మిడిలార్డర్‌లో సరైన తోడ్పాటు అందడం లేదు. రాయుడు పర్వాలేదనిపిస్తున్నా.. కెప్టెన్ ధోనీ తన ఘోర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆల్‌రౌండర్ డ్వేన్‌ బ్రావో గాయం కారణంగా ఆ జట్టుకు దూరం కావడం పెద్ద దెబ్బఅనే చెప్పాలి.

ఎక్కిళ్లు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి

ముంబై విషయనికొస్తే.. అన్ని విభాగాల్లో రాణిస్తూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సూపర్ పర్ఫారెన్స్‌ ఇస్తున్నారు. ఆ జట్టులో ఆల్‌రౌండర్లకు కొదవలేదు. బ్యాటింగ్‌లో కూడా ఆ జట్టు ప్రదర్శన చాలా ఆశాజనకంగా ఉంది. బౌలర్లలో బుమ్రా, బౌల్ట్, రాహుల్‌ చాహర్‌ అదరగొడుతున్నారు. చూడాలి మరి మొదటి మ్యాచ్‌లో జరిగిన పరాభవానికి ముంబై బదులు తీర్చుకుంటుందేమో. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై జట్టుకు రోహిత్‌కు బదులుగా పొలార్డ్‌ కెప్టెన్సీ వహిస్తున్నాడు. హిట్‌మ్యాన్‌ లేకపోవడం ముంబైకి ఇబ్బందిగా మారింది.

విటమిన్‌ టాబ్లెట్స్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -