ఐపీఎల్ టోర్నీ రెండో అంచెకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లే ఆఫ్ పోరు మొదలవుతోంది. క్వాలిఫయర్ 1లో పాయింట్ల టేబుల్లో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు ఈ మ్యాచ్ ఆడతాయి. ముంబయి ఇండియన్స్ జట్టు తొలి స్థానంలో నిలవగా.. ఢిల్లీ జట్టు రెండో స్థానంలో ఉంది. కాగా, డిపెండింగ్ చాంపియన్‌తో పోరు అంటే ఆశామాశి వ్యవహారం కాదు. టోర్నీలో ముంబై మిగితా జట్లను గడగడలాడించింది. ముంబై జట్టు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ మాత్రం కలిసికట్టుగా ఆడలేకపోతున్నారు. లీగ్ దశలో ఒకానొక సమయంలో టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ వరుస పరాజయాలను చవిచూసింది. ఎట్టకేలకు కీలకమైన మ్యాచ్‌లో ఆర్సీబీతో గెలిచి, టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది.
మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఛేదనకే మొగ్గి చూపినట్టుంది. కాగా, గత మ్యాచ్ ద్వారా ఫీల్డ్‌లోకి అడుగిడిన రోహిత్ శర్మ(ముంబై కెప్టెన్) తన జట్టుకు ఎంత బలమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబై బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉంది. ఓపెనర్లు రోహిత్, డీకాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, పొలార్డ్, పాండ్యా బ్రదర్స్.. ఇలా ప్రతి బ్యాట్స్‌మెన్ ప్రతిభ గల వారే.
ఈ మ్యాచ్ గెలవాలంటే ఢిల్లీకి కత్తి మీద సామే అని చెప్పవచ్చు. చూద్దాం మ్యాచ్ గెలిచి ఎవరు ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటారో..
జట్లు:
ముంబై: రోహిత్ శర్మ(కెప్గెన్), డీ కాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, కోల్టర్‌నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వి షా, శిఖర్ ధావన్, రహానే, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), స్టోయినిస్, డానియెల్ సామ్స్, అక్సర్ పటేల్, అశ్విన్, రబాడా, నోర్ట్జే.