end
=
Friday, September 20, 2024
క్రీడలుకోహ్లి కెప్టెన్సీ వదిలేయడమా..! నెవర్
- Advertisment -

కోహ్లి కెప్టెన్సీ వదిలేయడమా..! నెవర్

- Advertisment -
- Advertisment -

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ట్రోఫీని అందించనంత మాత్రాన కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలా..! అది జరగని పని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌ నుంచే నిష్ర్కమించిన ఆర్సీబీ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కోహ్లి కెప్టెన్సీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కొందరు మాజీ ఆటగాళ్లు. ఐపీఎల్‌ ముగిసిన అనంతరం.. మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌.. విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశాడు. గత ఎనిమిదేళ్లుగా ఒకే జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ.. ట్రోఫీ సాధించకపోవడం ఏ మాత్రం ఆమోదయయయోగ్యం కాదని గంభీర్‌ స్పందించాడు. ఆర్సీబీ కెప్టెన్సీతో పాటు టీ 20, వన్డే ఫార్మాట్లకు రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంపికచేయాలని సూచించాడు.

గంభీర్‌ మాటలకు ఇటీవల సెహ్వాగ్‌ కూడా కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. టీమ్‌ ఓడినంత మాత్రాన విరాట్‌ విమర్శించడం తగదన్నాడు. ఇప్పుడు అతనికి తోడు ఆకాశ్‌ చోప్రా కూడా నిలిచాడు. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడం అసమంజసం అన్నాడు. ఆర్సీబీ ట్రోఫీ సాధించకపోయినా.. కోహ్లి వ్యక్తిగత ప్రదర్శన ఎప్పుడూ బాగుంటుందన్నాడు. అతను జట్టును ముందుండి నడిపిస్తాడని ఆకాశ్‌ వ్యాఖ్యానించాడు. అతడికి ఐసీసీ ట్రోఫీలు, ఐపీఎల్‌ ట్రోఫీలు లేకపోవచ్చు కానీ, అతను కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి భారత్‌ అన్ని ఫార్మాట్లలో అద్భుత విజయాలు సాధించిందన్న విషయం మరువరాదని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.

రోహిత్ ముంబైకి కాకుండా ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉంటే 5ట్రోఫీలు సాధించేవాడా..? అని ఆకాశ్‌ చోప్రా.. గంభీర్‌ను ప్రశ్నించాడు. రోహిత్‌ గొప్ప కెప్టెనే కావచ్చు. కానీ, ముంబై విజయాన్ని టీమిండియాతో పోల్చలేమన్నాడు. ఆర్సీబీ అతిగా విరాట్, ఏబీ, పడిక్కల్‌ పైనే ఆధారపడిందనీ.. తద్వారా వారి జట్టు ఓటమి చవిచూసిందని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -