ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన డీసీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఢిల్లీ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌గా ఉంది. ఇప్పటికే లీగ్‌మ్యాచుల్లో ఇరు జట్లు చెరో 9 మ్యాచ్‌లు ఆడగా.. డీసీ 7మ్యాచుల్లో గెలిచి 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. పంజాబ్ 3 మ్యాచుల్లో గెలిచి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.
ఇరు జట్ల బలాలు చూస్తే రెండు పటిష్టంగానే ఉన్నప్పటికీ.. పంజాబ్ జట్టు చివర్లో తడబడుతోంది. కెప్టెన్ రాహుల్‌పై ఆ జట్టు అతిగా ఆధారపడుతోంది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయిన రాహుల్ జట్టు.. పాయింట్ల పట్టికలో మాత్రం చాలా వెనకబడి ఉంది. ఆ జట్టు చాలా మ్యాచ్‌లు విజయం అంచు వరకు వచ్చి ఓడిపోవడం వారి దురదృష్టమనే చెప్పాలి. యూనివర్సల్ బాస్ గేల్ జట్టులోకి వచ్చాక పంజాబ్ మరింత బలపడిందని చెప్పొచ్చు. మయాంక్ అగర్వాల్.. రాహుల్‌కు చక్కటి సహకాన్ని అందిస్తున్నా, భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. ఆ జట్టుకు భారీ హిట్టర్ నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్ లాంటి హిట్టర్లు ఉండనే ఉన్నారు. బౌలింగ్‌లో మహమ్మద్ షమీ అదరగొడుతున్నాడు.
డీసీ విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో గబ్బర్(శిఖర్ ధావన్) సెంచరీతో అదరగొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్ మంచి ఆరంభాలిస్తున్నారు. కెప్టెన్ అయ్యర్ అదరగొడుతున్నాడు. రిషబ్‌పంత్, హిట్‌మైర్, స్టోయినిస్ లాంటి హిట్టర్లు ఆ జట్టుకు అదనపు బలం. బౌలింగ్‌లో రబాడ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రబాడా పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా. అతనికి స్టోయినిస్, అశ్విన్, అక్సర్ పటేల్ చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుః పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, డానియెల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిసో రబాడా.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుః కే ఎల్ రాహుల్(కెప్టెన్/వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, జిమ్మీ నీషమ్, మురుగన్ అశ్విన్, షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.