end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంప్రధాని మోదీ ఉండగా అలా జరగడమా..! నెవెర్‌
- Advertisment -

ప్రధాని మోదీ ఉండగా అలా జరగడమా..! నెవెర్‌

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నంత వరకు ఏ కార్పొరేట్ సంస్థ రైతుల భూములను లాక్కోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కొనసాగుతుందని, మండీలు మూసివేయబోమని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో కిషన్‌బాగ్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లోని ఏ ప్రొవిజన్ అయినా తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు రైతు సంస్థలకు అనిపిస్తే కనుక చర్చించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కనీస మద్దతు ధర, వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలు పూర్తిగా అబద్ధాలు చెబుతున్నాయి. కనీస మద్దతు ధర కొనసాగుతుందని, మండీలు మూసివేయబోమని మరోమారు చెబుతున్నా. రైతుల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’’ అని షా స్పష్టం చేశారు. ఎంఎస్‌పీపై ఒకటిన్నర రెట్లు ఇవ్వాలన్న సంవత్సరాల డిమాండ్‌ను 2014-19 మధ్య మోదీ ప్రభుత్వం అమలు చేసిందని షా వివరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -