end
=
Sunday, July 7, 2024
వార్తలురాష్ట్రీయంPawan Kalyan:పవన్ కళ్యాణ్‌ను చంపేస్తారా..
- Advertisment -

Pawan Kalyan:పవన్ కళ్యాణ్‌ను చంపేస్తారా..

- Advertisment -
- Advertisment -
  • వైసీపీ తీరుపై మండిపడ్డ చంద్రబాబు నాయుడు
  • తప్పుడు పనుల కోసమే సీఎం పదవంటూ ఎద్దేవా
  • కబ్జాల గురించి ప్రశ్నించినందుకే అయ్యన్న అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో (AP) రాజకీయం రోజురోజుకు వెడెక్కుతోంది. వైసీపీ (YCP), జనసేనా (JANASENA), టీడీపి (TDP) పార్టీనేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరూ మాటాల తూటాలతో దాడిచేసుకుంటున్నారు. ఈ మేరకు గతవారం వైసీపీ తీరుపై మండిపడ్డ జనసేనా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ (Pawan kalyan)తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)దనదైన స్టైల్‌లో విరుచకుపడ్డాడు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కబ్జాల గురించి ప్రశ్నించిన అయ్యన్న (Ayyanna Patrudu)ను అరెస్టు (Arrest)చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు.. పవన్ కల్యాణ్ పై దాడి చేసి చంపేస్తారా? తప్పుడు పనుల కోసమే సీఎం (CM) పదవిని చేజిక్కించుకున్నారా? అంటూ ఫైర్ అయ్యాడు.

ఈ మేరకు అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ఠగా మారిందని ఆక్షేపించారు. పవన్ కల్యాణ్ మీద దాడులు చేస్తారా. చంపేస్తారా తెల్లవారు (Morning)జామున 3 గంటలకు వెళ్లి అయ్యన్నను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు (police) తాగి గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కొంతమంది అధికారులు తప్పుడు విధానాలతో ముందుకు వెళ్తున్నారన్న చంద్రబాబు.. అలాంటి వారిని వదిలి పెట్టేదే లేదని స్పష్టం చేశారు. బాబాయిని హత్య చేయించినట్లుగా అయ్యన్నపాత్రుడు ఏమీ చేయలేదే? ధైర్యం ఉంటే జగన్‌ (Jgan)బాబాయిని హత్యచేసిన వారిని అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. వివేకా హత్య కేసులో సీఐ శంకరయ్య  (CI Shankaraiah)సీబీఐకి (CBI)తొలుత వాంగ్మూలం ఇచ్చారని, ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందాక ఆ వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారని చంద్రబాబు చెప్పారు. తప్పుడు పనులు చేయడంలో జగన్‌కు అవార్డు (Award)ఇవ్వాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై అటు సోమువీర్రాజు, (somu verraju)ఇటు చంద్రబాబు కూడా రెస్పాండ్ (respond)అయ్యారు. మరోవైపు ఏపీలో కాపు సర్కిళ్లల్లో పవన్ కల్యాణ్‌ను హత్య చేసేందుకు సుపారీ (supari)ఇచ్చారంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు.

(Munugode by Elections : ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు)

‘అలాగే భూ దోపిడీ కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర (history) జగన్‌ది. ఇడుపులపాయలో (idupulapaya) వందల ఎకరాలు ఆక్రమించుకున్నారు. బంజారాహిల్స్‌లో (Banjara hills)ప్రభుత్వ స్థలాన్ని కాజేసి సీఎం అయ్యాక రిజిస్టర్  (register)చేయించుకున్నారు. ఇంతటి భూ దోపిడీ కుటుంబ నేపథ్యం నుంచి జగన్‌ వచ్చారు. 0.02 సెంట్ల భూమి ఆక్రమణ ఆరోపణలపై అయ్యన్నను అరెస్టు చేయించడం దుర్మార్గం. వైఎస్‌ (ys)కుటుంబం అక్రమాలపై ఫిర్యాదు చేస్తాం. చర్యలు తీసుకుంటారా? హత్య చేసిన అవినాష్‌కు (Avinash)అభయం ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర కబ్జాలను ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కుతారా? తప్పుడు పనులు చేయడానికే సీఎం పదవిలో జగన్‌ ఉన్నారు’ అంటూ తీవ్ర స్థాయిలో వివర్శలు చేశాడు.

ఇక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని సీఐడీ (CID) పోలీసులు గురువారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. నర్సీపట్నంలో (Narsipatnam)అయ్యన్న నివాసానికి వెళ్లిన పోలీసులు నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఇంటిగోడ కూల్చివేత విషయంలో ఫోర్జరీ (FORGERY )పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై అయ్యన్నపాత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని కుమారుడు చింతకాయల రాజేశ్‌ను (Rajesh)కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అయ్యన్నపాత్రుడి అరెస్టుపై ఆయన సతీమణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేయడమేంటని నిలదీశారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే.. పవన్ హత్యకు (Pawan Kalyan) కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయి. జనసేనానికి జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అంతేకాదు పవన్ భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. హైదరాబాద్‌లో (Hyderabad)జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఇంటి (house)వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు. పవన్ కల్యాణ్ పై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని జనసేన జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. బుధవారం నాదెండ్ల మనోహర్ (Nadendla manohar)ఇదే అంశంపై రెస్పాండ్ (respond)అయ్యారు. ఇవాళ తిరుపతిలో (thirupathi)హరిప్రసాద్ (Hari prasad) ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశంపై ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. పవన్ హత్యకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయి. జనసేనానికి జడ్ కేటగిరీ (Z Category) భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన నేతలు కిరణ్ రాయల్ (kiran), పసుపులేటి హరిప్రసాద్ (Hari prasad). అంతేకాదు పవన్ భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. పవన్ కళ్యాణ్ పై రెక్కీ నిర్వహణతో అనేక అనుమానలున్నాయని చెప్పారు. ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకుడు పవన్ కల్యాణ్ ఒక్కరే అని చెప్పారు. అన్ని సర్వేలలో  (servay)పవన్ సిఎం అవుతారని రావడంతో పవన్ పై కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు ఇదే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణా (Telangana DGP)డీజీపీని డిమాండ్ (Demand)చేశారు. రెక్కీ నిర్వహించి న అపరిచితులు వెనుక ఏ శక్తులు ఉన్నా యున్న విషయం బహిరంగ పరచాలని కోరారు.

(Rahul Jodo Yatra :మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -