-కరెంట్ షాక్ తో మృతి చెందిన మహిళ…
ఆందోల్: సెల్ ఫోన్ ఛార్జర్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గం మండలం అప్పాజీ పల్లికి చెందిన తలారి సత్యమ్మ (48) అనే మహిళ తన ఇంట్లో సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. ఆమెను వెంటనే 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. మృతురాలి భర్త తలారి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు.