నాలుగు రోజుల నుండి కనిపించకుండాపోయిన మహిళా తర్వాత రోజు శవమై కనబడింది. ఈ ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలి ఎన్టీఆర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం గచ్చీబౌలికి చెందిన ఓ మహిళా గత నాలుగు రోజుల కనిపించడం లేదని మహిళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అయితే అదే సమీపంలోని మరో గదిలో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు ఆ చుట్టు పక్కల వెతకగా సమీప గదిలో విగత జీవిగా మహిళా మృతదేహం పడిఉందని వివరించారు. వెంటనే స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఆ మహిళ మరణం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
- సెప్టెంబర్ 7 నుండి అన్‌లాక్ 4.0
- క్లాట్-2020 ప్రవేశ పరీక్ష వాయిదా
- మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు కరోనా పాజిటివ్