అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్(Jeff bezos)కు చెందిన బ్లూఆర్జిన్ (blue origin)సంస్థ చేపట్టిన రోదసీ యాత్ర విజయవంతం అయింది. బెజోస్ సతీమణి లారెన్స్ శాంజెజ్, ప్రముఖ గాయని కేటీ పెర్రీ(Katy perry), జర్నలిస్ట్ గేల్, చిత్ర నిర్మాత ఫ్లున్, పౌర హక్కుల కార్యకర్త అమాండ, మాజీ నాసా శాస్త్రవేత్త ఐషాను తీసుకుని ‘న్యూషెఫర్డ్’ స్పేస్ క్రాఫ్ట్ సోమవారం వెస్ట్ టెక్సాస్ నుంచి టేకాఫ్ అయింది. సముద్రమట్టానికి 106 కిలోమీటర్ల ఎత్తులో కొద్ది సేపు భారరహిత స్థితిని ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో ఉన్నవారంతా మహిళలు ఆస్వాదించారు. ఇలా పూర్తిగా మహిళలతో ఓ స్పేస్ క్రాఫ్ట్ (Space craft)వెళ్లడం ఈ శతాబ్దంలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1963లో ఇలా భూమి నుంచి మొత్తం మహిళామణులతో రోదసీ యాత్ర చేపట్టారు. 21వ శతాబ్దంలో మొత్తం మహిళలతో నింగిలోకి వెళ్లిన వాహక నౌక ఇదే కావడం విశేషం. వీరంతా రికార్డు క్రియేట్ చేశారు. ఈ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత పారాచూట్ల సాయంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. బెజోస్‌కు చెందిన బ్లూఆరిజిన్ సంస్థ 2000వ సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ సంస్థ మానవసహిత రోదసీ యాత్రలు చేపడుతూనే ఉంది. ఈ యాత్ర 11 నిమిషాల పాటు సాగింది. స్పేస్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి యాత్రలు పనికొస్తాయని బ్లూఆరిజిన్ సంస్థ ప్రకటించింది. ఇందులో ప్రయాణించిన వారంతా సెలబ్రెటీలే కావడం విశేషం.
- Advertisment -
మహిళలతో రోదసీలోకి స్పేస్ క్రాఫ్ట్.. అరుదైన రికార్డు !
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -