end
=
Saturday, January 18, 2025
వార్తలుఅంతర్జాతీయంనిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం...
- Advertisment -

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం…

- Advertisment -
- Advertisment -
  • ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌
  • ప్రజల నిర్లక్ష్యం వల్లే పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు అన్ని దేశాలలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అన్ని దేశాలు అన్‌లాక్‌ బాట పట్టాయి. దంతో కరోనా తీవ్రత ఊహించని విధంగా వ్యాప్తి చెందుతుంది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2, 68,57,679 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 88,0,075 మంది కరోనా మహమ్మారి సోకి మృత్యువాత పడ్డారు.

హాయ్‌ బావా… నేనంటే ఇష్టం లేదా!

కాగా 18,977,917 మంది వైరస్‌ బారి నుండి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 2,99,181 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 5,794 మరణాలు సంభించినట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌, రష్యా, అమెరికాతోపాటు ఇండియాలో కూడా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మెరికాలో అత్యధిక కేసులు(6,392,303), మరణాలు(192,168) సంభవించాయి.

పశువుల మందపై పెద్దపులి పంజా

ఇక భారత్‌లో కరోనా కేసులు 4,047,653 నమోదు కాగా, మృతుల సంఖ్య 69,920కి చేరింది. ఏదేమైనా ప్రజలు చాలా జాగ్రత్తతో ఉండాలని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అయినా చాలా మంది నిర్లక్ష్యం వహించడం వల్ల పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, హృద్రోగులు, డయాబీటస్‌ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలి, లేకపోతే ప్రాణాలు కోల్పోకతప్పదు.

ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -