end
=
Monday, March 31, 2025
వార్తలురాష్ట్రీయంWarangal:వరంగల్ నగరంలో దారుణం
- Advertisment -

Warangal:వరంగల్ నగరంలో దారుణం

- Advertisment -
- Advertisment -
  • మైనర్ బాలికపై అన్నదమ్ముల అత్యాచారం

దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేదింపులు ఆగట్లేదు. రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిపిల్లను సైతం లైంగికంగా వేదిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటిదే మరో దారుణమై సంఘటన వరంగల్ (Warangal) నగరంలో వెలుగు చూసింది. ఓ మైనర్ (Minor girl)బాలికపై గత ఆర్నేళ్లుగా అత్యాచారానికి (raped) పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ (Police arrest)చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా గత ఆరు (6 months) నెలలుగా వారి కోరికలను తీర్చుకుంటున్నారు. వీడియోలు (video) రికార్డులు చేసి భయపెట్టారు. తీరా విషయం కాస్త బాలిక తల్లికి తెలియటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ నగరంలోని ఓ కాలనీలో 15ఏళ్ల (years)బాలిక (girl)తల్లితో కలిసి నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో అలీ (ALI)(26), అబ్బు (ABBU)(22) ఉంటున్నారు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు (BROTHERS)అవుతారు. పక్కింటి బాలికపై కన్నేసిన ఇద్దరు అన్నదమ్ములు. పదో తరగతి (10 Class)చదువుతున్న ఆ బాలికకు మాయమాటలతో దగ్గరై ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరు నెలలుగా దారుణానికి తెగబడుతూ తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. వరంగల్‌ నగరంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నర్సంపేటకు (Narsampeta) చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం వరంగల్‌ వలస వచ్చింది. స్థానికంగా ఓ కాలనీలో బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఇక బాలిపై కన్నేసిన వీరు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నారు. ఎవరూ లేని సమయంలో ఒకరికి తెలియకుండా మరొకరు ఇంటికి పిలిపించి పలుమార్లు రేప్ (repe) చేశారు. ఈ టైంలో నగ్న చిత్రాలు (nude pics), వీడియోలు (videos)తీశారు. వాటిని సోషల్ మీడియాలో (social media) పోస్టు చేస్తామని బాలికను బెదిరించేవారు. బాలికకు నిందితులు పలుమార్లు సైగలు చేయడం గమనించిన తల్లి మందలించడంతో బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు (POCSO Act case) నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల ఇంటిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బీజేపీ (BJP) నాయకులు దాడి చేశారు. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఈ ఘటనపై వరంగల్ నగర సీపీ ఏవీ రంగనాథ్ (CP AV Ranganathan) స్పందిస్తూ.. బుధవారం అర్ధరాత్రి ఫిర్యాదు అందిందని చెప్పారు. మైనల్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని వెల్లడించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఐపీసీ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ ఇంటి పెద్ద డ్రైవర్‌గా పని చేస్తుండగా అతని కుమార్తె(15) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే, వారి పక్కంటిలో ఉండే మహ్మద్‌ అజ్మత్‌ అలీ (26), మహ్మద్‌ అక్బర్‌ అలీ (22) (Mohammad Azmat Ali, Mohammad Akbar Ali) అనే సొంత అన్నదమ్ములు ఆ బాలికపై కన్నేశారు. ఇరుగుపొరుగు కావడంతో పరిచయం పెరిగి ఆ బాలికను పలుమార్లు పాఠశాలకు (schools) కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో మాయమాటలతో మభ్యపెట్టి ఒకరికి తెలియకుండా మరొకరు ఆ బాలికను శారీరకంగా వాడుకున్నారు. ఆరు నెలలుగా తమ కోరిక తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని బాలిక కూడా బయటపెట్టలేదు. అయితే, బాలిక కుటుంబసభ్యులకు చెందిన ఫోన్‌కు (phone) ఇటీవల వచ్చిన మెసేజ్‌లతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు ప్రశ్నించగా బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది.

(CM Jagan:రూట్ మార్చిన సీఎం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -