end

దిక్కుమాలిన ‘బిగ్‌బాస్‌’

  • బిగ్‌బాస్‌ 4కు ప్రేక్షకుల ఆదరణ కరువు

దిక్కుమాలిన బిగ్‌బాస్‌… ఎవరికి ఉపయోగం ఈ ప్రోగ్రాం… దీనికన్నా సినీమా చూసింది మేలు… తిట్టుకోవడం… అరవడం తప్పా సమాజానికి కానీ, వ్యక్తిగత ఎదుగుదలకు గానీ, కనీసం మానసికంగా ఆనందం పొందటానికి ఏమీ లేదు ఆ ప్రోగ్రాంలో అంటూ చాలా మంది ప్రేక్షకులు, గృహిణులు మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్‌’ ప్రోగ్రామ్‌ గురించి పెదవి విరుస్తున్నారు.

శ్రీశైలం లోయలో పడిపోయిన వ్యాను

బిగ్‌బాస్‌లో పాల్గొనే వారికి మాత్రం డబ్బులొస్తాయిగానీ… చూసేవాళ్లకు చిరాకు పుడుతోంది. పసలేని టాస్క్‌లు… వాడిపోయిన మోహాలతో ఈసారి బిగ్‌బాస్‌ ఫెయిల్‌ అయినట్లే అని మెజారిటీ ప్రేక్షకులు అనుకుంటున్నారు. అందుకే ఈసారి ఐపీఎల్‌ మీద అందరూ దృష్టి పెట్టనున్నారు. బిగ్‌బాస్‌ – 3 చూసినంతగా ఈ సారి ఎందుకో బిగ్‌బాస్‌ – 4ను ఎవరు సరిగ్గా చూడడం లేదనిపిస్తోంది. కాన్సెప్ట్‌ పాతబడిపోవడమే దీనికి కారణమా? ఇంకేదైనా కొత్తగా ఆలోచించాలి మరి.

డీఎస్సీ 2018 నియామకాలు!

Exit mobile version