end
=
Wednesday, September 18, 2024
వార్తలుఅంతర్జాతీయంఅగ్రరాజ్యంపై షియోమి కేసు
- Advertisment -

అగ్రరాజ్యంపై షియోమి కేసు

- Advertisment -
- Advertisment -

వాషింగ్టన్: చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టరాదంటూ అమెరికా ప్రభుత్వం విధించిన నిషేధంపై చైనా సంస్థ షియోమి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అమెరికా ప్రభుత్వంపైనే కేసు వేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టులో అమెరికా రక్షణ, ట్రెసరీ శాఖలను ప్రతివాదులుగా పేర్కొంటూ కేసు వేసింది. అమెరికాలోని ట్రంప్ హయాంలో విధించిన ఈ నిషేధం బైడెన్ హయాంలోనూ అదేవిధంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనెల ప్రారంభంలో ట్రంప్ షియోమిని పెంటాగాన్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. ఈ జాబితాలో పేర్లు ఉన్న కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టడం నిషిద్ధం. చైనా మిలిటరీతో షియోమికి సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ ఆరోపణల్ని ఆ కంపెనీ గతంలోనే ఖండించింది. తాము ఏ కమ్యునిస్టు చైనా మిలిటరీ కంపెనీ కాదంటూ తేల్చి చెప్పింది.

అయితే.. బైడెన్ గద్దెనెక్కాకైనా ఊరటలభిస్తుందని ఆశించినా షియోమికి నిరాశే ఎదురైంది. నిషేధం ఎత్తివేసే దిశగా బైడెన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు వెలువడని కారణంగా ఈ నిషేధాన్ని కోర్టులో సవాలు చేసేందుకు షియోమి నిర్ణయించుకుంది. కమ్యునిస్టు ప్రభుత్వం కంపెనీ అని తమను వర్ణించడాన్ని ఈ చైనా దిగ్గజ కంపెనీ తప్పుబట్టింది. ఇది పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని, దీని వల్ల తమ కంపెనీ మళ్లీ కోలుకోలేని విధంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా.. నిషేధం విధించే క్రమంలో అమెరికా ప్రభుత్వం సహేతుకమైన కారణాలేవీ చూపలేకపోయిందని కూడా స్పష్టం చేసింది. త్వరలో దీనిపై ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించనున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -