రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలపై సుప్రీంకోర్టు పూర్తి విచారణ చేపట్టాలని చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వణుకుపుడుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. అక్రమ సంపాదన, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వైఎస్ జగన్‌పై 12 ఛార్జషీట్‌లు ఉన్న సంగతి ఆయన మరిచిపోయారా? అంటూ ఎద్దేవా చేశారు.
మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
అయితే సుప్రీంకోర్టు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల కేసులు త్వరలో పూర్తి విచారణ జరిపి మూసి వేయాలని ఆజ్ఞాపించడంతో జగన్‌మోహన్‌రెడ్డికి భయం పట్టుకుందని చెప్పారు. అయితే గత టీడీపీ పరిపాలన మీద విచారణకై తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రజల దృష్టిని మరల్చడం కోసమే టీడీపీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా కూడా గత ప్రభుత్వాలపై 5 సంతవ్సరాల పాలన విషయంలో విచారణలు జరగలేవని, ఇది విచిత్రంగా ఉందని తెలిపారు.