end

రోడ్డు ప్రమాదంలో ఎంపీపీ మృతి

రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షురాలి ప్రాణం పోయింది. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఎంపిపి ప్రసన్నలక్ష్మీ మంగళవారం నాడు ఎంపిడిఓ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్నారు. అయితే తేలప్రోలు ఆనందపురం మార్గంలో రహదారిపై ఉన్న పెద్ద గుంతలో బైకు అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఎంపిపి ప్రసన్నలక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె భర్తకు స్వల్ప గాయాలు కావడంతో పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రసన్నలక్ష్మీ బుధవారం ఉదయం మరణించారు. గత సంవత్సరం తేలప్రోలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రసన్నలక్ష్మీ ఉంగుటూరు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు.

Exit mobile version