end

Potato:బంగాళాదుంపలతో అధిక బరువు తగ్గొచ్చు

  • కొత్త అధ్యయనంలో వెల్లడించిన పరిశోధకులు


మనలో చాలామందికి బంగాళాదుంప (potato) లంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఈ దుంపలు ఆహారంలో ప్రధాన పాత్ర ( major role in food) పోషించడంతో పాటు కొన్ని మంచి ఆరోగ్య ప్రోత్సాహకాలను, మరికొన్ని దుష్ర్పభావ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. కాగా ఈ పిండి పదార్థం కలిగిన దుంపలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ (Insulin resistance)ఉన్న వ్యక్తులకు, టైప్ 2 డయాబెటీస్ (Type 2 diabetes) ప్రమాదానికి ప్రధాన కారణంగా భావించి ఈ దుంపలను చాలా కాలంగా తిరస్కరించారు. కానీ తాజా పరిశోధనలో ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమైన బంగాళాదుంపలు అధిక బరువు కలిగిన వారిని త్వరగా సన్నబడేలా (weight loss) చేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు.

కాగా అధిక బరువు (heavy personality) కలిగిన వ్యక్తులకు ఈ తాజా అధ్యయనం సరికొత్త సంతృప్తినిచ్చింది. పిండి పదార్థం కలిగిన బంగాళాదుంపలు తక్కువ క్యాలరీలను కలిగి ఉండటం ద్వారా అధిక బరువున్న వ్యక్తులు చాలా త్వరగా సన్నబడటానికి ఆస్కారం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అధిక బరువున్న వ్యక్తులు క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం ద్వారా శరీరంలోని కేలరీల సంఖ్యను తగ్గించవచ్చని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ కాండిడా రెబెల్లో (The author is Professor Candida Rebello) తెలిపారు. అయితే ఈ అధ్యయనంలో అధిక బరువు, ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance) కలిగిన 18 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన 36మంది (36 people) ఈ పరిశోధనలో పాల్గొన్నారు. దీంతో ఈ పరిశోధనలో పాల్గొన్న వారికి రెండు డిఫరెంట్ ఫుడ్స్‌ (Different foods)ను సమకూర్చారు. అందులో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, అమెరికన్ మాంసం వినియోగంలో 40శాతం బీన్స్, బఠానీలు (Beans and peas account for 40 percent of American fruit, vegetable, and meat consumption) లేదా బంగాళాదుంపలను ఇచ్చారు.

(10 Days(1582):చరిత్రలో అదృశ్యమైన ఆ పది రోజులు)

‘‘మా అధ్యయనం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. మేము భోజనాన్ని తగ్గించలేదు, అందులో బంగాళాదుంపలను చేర్చడం ద్వారా వాటి కేలరీల కంటెంట్‌ను తగ్గించాము. దీంతో ఇందులో పాల్గొనేవారి భోజనం వారి కెలోరిఫిక్ (Calorific) అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. అందువల్ల బంగాళాదుంపతో కొంత మాంసాన్ని భర్తీ చేయడం ద్వారా పాల్గొనేవారు తమను తాము పూర్తిగా, వేగంగా తమ భోజనాన్ని తినలేకపోయారని కనుగొన్నట్లు’’ రెబెల్లో పేర్కొన్నారు. దీని ప్రయత్నంగా అధిక బరువు ఉన్న వ్యక్తులు చాలా తక్కువ ఖర్చుతో బరువు తగ్గవచ్చని తెలిపారు.

బంగాళాదుంపలలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు (Vitamin C, Vitamin B6, Potassium, Magnesium, Folate and Fiber, Antioxidants) ఉన్నాయి. కాబట్టి ఇది ఆహారం లేదా ఇంధనంలో ఉన్న శక్తి పరిమాణానికి సంబంధించినది. ఇందులో పాల్గొనే వ్యక్తుల భోజనంలోకి తరచూ.. బంగాళాదుంపలను తొక్కలతో ఉడకబెట్టి, ఆపై వాటి ఫైబర్‌ను పెంచడానికి 12 నుండి 24 గంటలు ఫ్రిజ్‌లో ఉంచారు. అనంతరం మెత్తని బంగాళాదుంపలను సలాడ్ స్కాలోప్‌ (Salad Scallop)ల రూపంలో వారికి అందజేశారు. దీంతో పోషకాల కంపారిజన్‌ (Comparison)పై శాస్త్రవేత్తలు బంగాళాదుంపలు, బీన్స్, బఠానీల వలె ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉన్నాయని వారు కనుగొన్నారు.

అయితే ‘‘ఈ పరిశోధనలో బంగాళాదుంపలు రక్తంలోని గ్లూకోజ్ (Blood glucose) స్థాయిలను ప్రతికూలంగా ప్రభావితం చేయవని మేము నిరూపించాము. నిజానికి చెప్పాలంటే మా అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు బరువు కోల్పోయారు’’ అని రెబెల్లో పేర్కొన్నారు. జర్నల్ ఆఫ్ మెడికల్ ఫుడ్‌లో (Journal of Medical Food) ప్రచురించబడిన ఈ అధ్యయనం కారణంగా.. చాలామంది ప్రజలు ఇప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించగలరని.. బంగాళాదుంపలను తినేందుకు మరికొంచెం ఆసక్తి చూపిస్తారని ఆయన తెలిపారు. అధ్యయనం ప్రధాన పరిశోధకుడు పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్. జాన్ కిర్వాన్ (Pennington Biomedical Research Center Executive Director Dr. John Kirwan) మాట్లాడుతూ.. మధుమేహం, ఊబకాయంపై (Diabetes and obesity) ఆహార ప్రభావాలను పరిశోధించడానికి ఈ అధ్యయనాన్ని ఉపయోగించాము. ఇది ‘కంప్లెక్స్ డిసీజ్’ (‘Complex Disease’). కాబట్టి దానిని ఎలా పరిష్కరించాలి అనే దానిపై మరింత తెలుసుకోవాలని ఆయన తెలిపారు.

(Signals:సిగ్నల్స్ ఫాలో అవుతున్న పురుగులు)

Exit mobile version