end

Mallikarjun Kharge:దేశం కోసం మీరు ఏ త్యాగం చేయలేదు

  • బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఖర్గే
  • దేశం కోసం పార్టీ కుక్క కూడా చావలేదని ఎద్దేవా


కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్దున్ ఖర్గే (Congress President and Leader of Opposition Mallikarjun Kharge) బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత స్వాతంత్ర్య సమర సమయంలో కాంగ్రెస్ (Congress)నేతలు ప్రాణత్యాగాలు చేశారని, బీజేపీ నుంచి పార్టీకి చెందిన ఒక కుక్క కూడా చావలేందంటూ ఎద్దేవా చేశాడు. రాజస్థాన్ లోని ఆల్వార్‌లో భారత జోడో యాత్ర (Indian Jodo Yatra in Alwar, Rajasthan)లో పాల్గొన్న ఖర్గే వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా చైనా సైనికుల చొరబాటు (Invasion of Chinese troops), తదనంతర ఘర్షణలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) దేశం వెలుపల సింహం లాగా వ్యవహరిస్తుందని, కానీ చైనాను ఎదుర్కునే విషయంలో మాత్రం చిట్టెలకలాగా ముడుచుకుపోతుందని ఎద్దేవా చేశారు. భారత్, చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంటులో (Parlament)చర్చకు కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడాన్ని ఖర్గే తప్పుపట్టారు. చైనా దాడిపట్ల చేష్టలుడిగి చూస్తున్న వాళ్లు, తామే దేశభక్తులమని గప్పాలు కొట్టుకుంటూ దాన్ని ప్రశ్నిస్తున్న తమను మాత్రం దేశద్రోహాలు అనడం హాస్యాస్పదమని ఖర్గే వ్యాఖ్యానించారు.

అలాగే బీజేపీ పాలనలో సరిహద్దు హింస తరచుగా జరుగుతోందని, కేంద్రం వాస్తవాలు దాచిపెడుతోందని ఆరోపించారు. గల్వాన్ లోయ (Galvan loya)లో 20 మంది భారత సైనికులు (Indian soldiers)అమరులైతే, ప్రధాని నరేంద్రమోడీ (Narendramodi) మాత్రం చైనా అధ్యక్షుడితో 18 సార్లు భేటీ అయ్యారని హేళన చేశారు. ఒకవైపు మోడీ, జిన్‌పింగ్‌ (Xi Jinping)లు సమావేశాల్లో సరదాగా గడుపుతుంటారు, మరోవైపు చైనాతో సరిహద్దులో ఘర్షణలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. భారత్ చైనా మధ్య సరిహద్దు సమస్య చెలరేగినప్పుడల్లా దేశాన్ని విడగొట్టడానికి రాహుల్ గాంధీ (Rahul gandhi) ప్రయత్నిస్తున్నారని బీజేపీ నిందిస్తూ ఉంటుందని, సరిహద్దు ఘర్షణలు పెరుగుతున్నప్పటికీ ఎవరో మనల్ని తేరిపార చూడలేరని బీజేపీ గప్పాలు కొట్టుకుంటూ ఉంటుందని ఖర్గే పేర్కొన్నారు. ప్రభుత్వం సరిహద్దు సమస్యను ఎలా పరిష్కరిస్తోందో ప్రజలకు చెప్పాలనే అభిప్రాయంతోనే తాము చర్చకు డిమాండ్ చేస్తుంటే చర్చే వద్దని బీజేపీ చెబుతోందని ఖర్గే ఆరోపించారు. ఒకరకంగా ప్రభుత్వం చర్చల నుండి పారిపోతోందన్నారు. రైతులు, నిరుపేదల స్వరాలను అణగదొక్కడం మాత్రమే బీజేపీకి తెలుసని, పైగా మతం, భాష ప్రాతిపదికన ప్రజలను విడదీయడమే బీజేపీకి ముఖ్యమైన కార్యక్రమం అయిపోయిందని ఖర్గే విమర్శించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నా, కేంద్రం ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ (Event Management)లో మునిగిపోయిందంటూ దుయ్యబట్టారు.

(Iran:ఐక్యరాజ్యసమితి సంఘం నుంచి ఇరాన్ బహిష్కరణ)

Exit mobile version