హైదరాబాద్ లో మూసీ నదీ ఉద్ధృతంగా ప్రవహిస్తు ఉండటంతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. రాజేంద్రనగర్ లోని ఈసీ వాగులో చిక్కుకున్న యువకుడ్ని ట్రాఫిక్ పోలీసులు రక్షించారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈసీ వాగు చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తడంతో ఈసీ వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డులోని సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవాహిస్తుంది. ఈ ప్రవాహాన్నిచూసుకోకుండా వచ్చిన ఓ వ్యక్తి వంతెనపై చిక్కుకున్నాడు. వంతెనపై చిక్కుకున్న యువకుడు అరుపులు వేయడంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు. యువకుడిని అరవింద్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు. అతడిని రక్షించిన అనంతరం అరవింద్ మాట్లాడుతూ తాను చనిపోతానేమో భయం వేసిందన్నారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వచ్చి తనను కాపాడారన్నారు. బైక్ తో పాటు అరవింద్ ను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు.
- Advertisment -
ఈసీ వాగులో చిక్కుకున్న యువకుడు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -